2029 ఎన్నికలకు తొలి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన జగన్ - టీడీపీ కంచుకోటలో..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాల ను సిద్దం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాల వారీగా ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్... స్థానిక ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు. వ్యూహాత్మక నిర్ణయాలు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధుల పైన సూచనలు చేస్తూనే.. టీడీపీ కంచుకోటలో 2029 ఎన్నికలకు తొలి ఎంపీ అభ్యర్ధిని ఫిక్స్ చేసారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర కేంద్రంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మజ్జి శ్రీను పార్టీ వీడిన తరువాత పరిణామాల పైన ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీనియర్ బొత్సా తో సుదీర్ఘంగా ఒన్ టు ఒన్ సమావేశం నిర్వహించారు. కాగా, అదే సమయంలో శ్రీకాకుళంలో నేతల మధ్య కోల్డ్ వార్ అంశం పైనా చర్చ జరిగింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం సైతం జగన్ తో భేటీ అయ్యారు. తాజాగా ఆయన తనయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జిల్లాలో పార్టీ నేతల గురించి చెబుతూ... జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో.. జగన్ సూచనతో తాడేపల్లి వచ్చిన తమ్మినేని తన కుమారుడి వ్యాఖ్యల వెనుక కారణాలను వివరించారు. ఇదే సమయంలో జగన్ స్థానిక ఎన్నిక ల కోసం కలిసి పని చేయాలని.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ్మినేని సీతారం ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తారని తేల్చి చెప్పారు.

 మజ్జి శ్రీనుకి జగన్ రిటర్న్ గిఫ్ట్ - పొటిలికల్ 'లాక్'.. సీన్ రివర్స్..!!
మజ్జి శ్రీనుకి జగన్ రిటర్న్ గిఫ్ట్ - పొటిలికల్ 'లాక్'.. సీన్ రివర్స్..!!
ys-jagan-fixed-big-task-for-tammineni-sitaram-in-srikakulam-dist-amid-latest-developments-here-the

జగన్ తాజా నిర్ణయంతో

డీలిమిటేషన్ లో మార్పులు జరిగితే మినహా.. ఆయనే అభ్యర్దిగా ఉంటారని జగన్ చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. కాగా.. శ్రీకాకుళం టీడీపీకి కంచుకోటగా ఉంది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఎంపీ సీటు లో అభ్యర్ధులను మార్పు చేస్తూ వచ్చారు. కానీ, వరుసగా మూడు సార్లు కింజరపు రామ్మోహన్ నాయుడు గెలిచి.. కేంద్ర మంత్రిగా ఉన్నారు. డీలిమిటేషన్ జరిగితే మారే సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని జగన్ చెబుతున్నారు. అయితే.. తమ్మినేని అభ్యర్దిత్వం పైన పార్టీ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ జగన్ ఎంపీ అభ్యర్దిగా హామీ ఇవ్వటం పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+