విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! సెప్టెంబర్ 20న..!
పండుగల సీజన్ కారణంగా విజయవాడ-తిరుపతి (vijayawada-tirupati) మధ్య ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు చేసుకోవాలనుకునే వారు, అలాగే తిరుగు ప్రయాణాలు చేసే వారి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 20న ఈ రెండు రైళ్లు విజయవాడ-తిరుపతి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయని అధికారులు ప్రకటించారు.
అదనపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే సెప్టెంబర్ 20న ఆదివారం తిరుపతి- విజయవాడ మధ్య ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నం. 07606 - తిరుపతి-విజయవాడ ప్రత్యేక రైలు తిరుపతి నుంచి అర్ధరాత్రి 1:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఉదయం 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలుకు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్ లో స్టాప్ లు ఉంటాయి.

అలాగే రైలు నం.07605 విజయవాడ-తిరుపతి ప్రత్యేక రైలు విజయవాడలో సెప్టెంబర్ 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి తిరుపతికి సాయంత్రం 4:45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ లో ఆగుతుంది. ఈ రెండు రైళ్లలోనూ మొత్తం 22 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 2 స్లీపర్ కోచ్‌లు, 16 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 4 స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకుని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
