HIV: నేషనల్ ఎమర్జెన్సీ విధించిన దేశం.. 2 నెలల పసిబిడ్డకు వైరస్

ప్రపంచం మొత్తం ప్రాణాంతక హెచ్ఐవీ (HIV) వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పురోగతి సాధిస్తుంటే.. పసిఫిక్ మహాసముద్రంలోని అందమైన ద్వీపదేశం ఫిజీ (Fiji) మాత్రం ఇందుకు భిన్నంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో హెచ్ఐవీ కేసులు మున్మెన్నడూ లేని విధంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా పెరుగుతుండటంతో ఫిజీ ప్రభుత్వం మంగళవారం 'జాతీయ హెచ్ఐవీ ఎమర్జెన్సీ' (National HIV Emergency) ప్రకటించింది. పర్యాటకులకు స్వర్గధామం, స్నేహపూర్వక సంస్కృతికి నిలయమైన ఈ చిన్న దేశంలో ఇప్పుడు ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్ఐవీ వైరస్‌తో జీవిస్తున్నారని అంచనా. ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణం దేశాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాల మహమ్మారి అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

చిమ్మచీకటిలో చిన్నారుల భవిష్యత్తు.. 2 నెలల పాపకూ వైరస్!

ఈ మహమ్మారి ఉధృతి ఎంత భయానకంగా ఉందంటే.. పసికందులను కూడా వదలడం లేదు. హెచ్ఐవీ , క్షయ (TB) వ్యాధి రెండూ సోకిన కేవలం రెండు నెలల పాపను అత్యంత చిన్న వయస్కురాలైన రోగిగా గుర్తించామని 'సేవ్ ద చిల్డ్రన్ ఫిజీ' సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వైరస్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీయడం వల్ల క్షయ వ్యాధి సులభంగా సోకుతుంది. గత ఏడాది ఏకంగా 59 మంది తల్లుల నుంచి తమ బిడ్డలకు హెచ్ఐవీ వైరస్ సంక్రమించింది. ఈ పరిస్థితి పసిపాపల భవిష్యత్తును చిమ్మచీకటిలోకి నెడుతోంది.

Fiji Declares HIV National Emergency Surging Cases Linked to Methamphetamine Crisis Buck Global Trend

డ్రగ్స్ చిచ్చు.. నీడిల్స్ షేరింగ్ వల్లే సగం కేసులు!

ఫిజీలో హెచ్ఐవీ సంక్షోభానికి ప్రధాన కారణం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే అలవాటు వేగంగా పెరగడమేనని 'యూఎన్ఎయిడ్స్' (UNAIDS) సలహాదారు రెనాటా రామ్ తెలిపారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా మార్కెట్లకు డ్రగ్స్ రవాణాకు ఫిజీ కీలక స్థానంగా మారింది. ఈ క్రమంలో స్థానిక యువత డ్రగ్స్ బారిన పడటమే కాకుండా.. ఒకే సిరంజి, నీడిల్స్‌ను పంచుకోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. 2025లో నమోదైన కొత్త కేసుల్లో సగం మంది ఇంజెక్షన్ డ్రగ్స్ వల్లే వైరస్ బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.

HIV Injection: ఎయిడ్స్ పేషెంట్లకు బిగ్ రిలీఫ్.. భారత్‌కు రాబోతున్న ఇంజెక్షన్
HIV Injection: ఎయిడ్స్ పేషెంట్లకు బిగ్ రిలీఫ్.. భారత్‌కు రాబోతున్న ఇంజెక్షన్

రక్షణ లేని శృంగారం.. 50 మంది గర్భిణీల్లో ఒకరికి!

డ్రగ్స్‌తో పాటు, అవగాహన లోపం, కండోమ్ వాడకం తక్కువగా ఉండటం, బహుళ భాగస్వాములతో రక్షణ లేని శృంగారం (Unprotected sex) కూడా వైరస్ వ్యాప్తికి మరో ప్రధాన కారణం. దేశంలోని గర్భిణీ స్త్రీలలో ప్రతి 50 మందిలో ఒకరు హెచ్ఐవీ వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రి డాక్టర్ అటోనియో లాలబలావు తెలిపారు. దీనివల్ల గర్భధారణ, ప్రసవం, పాలిచ్చే సమయంలో వైరస్ బిడ్డలకు సంక్రమించే ప్రమాదం ఉంది. కేవలం 39% మందికి మాత్రమే తాము హెచ్ఐవీ పాజిటివ్ అని తెలుసునని, అందులో 22% లోపే చికిత్స తీసుకుంటున్నారని గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చికిత్సకు అడ్డుగోడగా 'సామాజిక వివక్ష'..

ఫిజీ సమాజంలో హెచ్ఐవీ వ్యాధి గురించి చాలా తక్కువ అవగాహన ఉందని, ఈ వ్యాధి సోకిన వారిపై తీవ్ర సామాజిక వివక్ష ఉందని 'ఫిజీ నెట్‌వర్క్ ప్లస్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోలి కోలాటి తెలిపారు. ఈ వివక్ష భయంతోనే చాలామంది హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి, చికిత్స తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. డ్రగ్స్ అలవాటు, వివాహేతర శృంగారం వంటి కారణాలు ఉండటంతో వివక్ష మరింత ఎక్కువగా ఉంది. చికిత్స అందుబాటులో ఉన్నా.. భయం వల్ల దాన్ని పొందే అవకాశం కోల్పోతున్నారు.

7 వేల మందికి పైగా విద్యార్థులకు HIV పాజిటివ్: ప్రభుత్వం సంచలన నిర్ణయం!
7 వేల మందికి పైగా విద్యార్థులకు HIV పాజిటివ్: ప్రభుత్వం సంచలన నిర్ణయం!

యుద్ధ ప్రాతిపదికన చర్యలు.. నీడిల్స్ మార్పిడి కార్యక్రమం!

పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫిజీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హెచ్ఐవీ పరీక్షలు, చికిత్స సదుపాయాలను విస్తరిస్తున్నామని ఆరోగ్య మంత్రి తెలిపారు. నివారణ మందు అందుబాటును పెంచుతున్నామని, డ్రగ్స్ వాడేవారి కోసం అధికారిక నీడిల్ , సిరంజి మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, సామాజిక వివక్ష చూపకుండా బాధితులకు మద్దతు ఇవ్వాలని మంత్రి ప్రజలను కోరారు. చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని 19 ఏళ్లుగా హెచ్ఐవీతో జీవిస్తున్న కోలాటి భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+