Raghuram Rajan: అమెరికా కోసం పనిచేయబోతున్న మాజీ ఆర్బీఐ గవర్నర్

అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై భారతీయుల ప్రతిభ మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాకు చెందిన కేంద్రీయ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' (ఫెడ్) ఏర్పాటు చేసిన కీలక కమిటీల్లో ముగ్గురు భారతీయులకు అత్యున్నత స్థానం దక్కింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో పాటు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మలను ఈ ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌లలో సభ్యులుగా నియమించారు.

అమెరికా ద్రవ్య విధానం, ఆర్థిక వ్యూహాలను క్షుణ్ణంగా సమీక్షించేందుకు ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ ఐదు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయగా, అందులో ఈ ముగ్గురు భారతీయ దిగ్గజాలకు చోటు లభించడం విశేషం.

US Federal Reserve Appoints Raghuram Rajan and Two Other Indians to Crucial Monetary Policy Panels

ఫెడ్ బ్యాలెన్స్ షీట్ బాధ్యతల్లో రఘురామ్ రాజన్

ఈ నియామకాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఆయనను అత్యంత కీలకమైన 'బ్యాలెన్స్ షీట్ పాలసీ' టాస్క్‌ఫోర్స్‌కు ఎంపిక చేశారు. హార్వర్డ్ ఆర్థిక వేత్త కారెన్ డైనన్, ఫెడ్ మాజీ గవర్నర్ జెరెమీ స్టెయిన్‌లతో కలిసి రాజన్ ఈ ప్యానెల్‌లో పనిచేయనున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత ఆర్థిక నిల్వలు, వాటి వల్ల కలిగే లాభనష్టాలు, సంస్థాగత ప్రభావాలపై ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది.

కాగా, రఘురామ్ రాజన్ గతంలో (2013-2016) ఆర్బీఐ గవర్నర్‌గా దేశీయ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. అంతకంటే ముందు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో చీఫ్ ఎకనామిస్ట్‌గా కూడా సేవలందించిన ఆయన, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

డేటా, ఉత్పాదకత ప్యానెల్స్‌లో రాజ్ చెట్టి, ఆశా శర్మ

ఆర్థిక అసమానతలు, ఉపాధి మార్కెట్‌పై లోతైన పరిశోధనలు చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ రాజ్ చెట్టిని 'డేటా' టాస్క్‌ఫోర్స్‌కు ఎంపిక చేశారు. ఫెడ్ తీసుకునే కీలక నిర్ణయాలకు అవసరమైన ఆర్థిక గణాంకాలను మరింత వేగంగా, పారదర్శకంగా ఎలా సేకరించాలనే అంశంపై ఈ ప్యానెల్ దృష్టి సారిస్తుంది.

మరోవైపు, మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌బాక్స్ (Xbox) సీఈఓగా ఉన్న ఆశా శర్మకు 'ప్రొడక్టివిటీ అండ్ జాబ్స్' కమిటీలో స్థానం కల్పించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త సాంకేతికతల వల్ల ఉద్యోగ ఉపాధి రంగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే కోణంలో ఈమె నేతృత్వంలోని బృందం అధ్యయనం చేయనుంది.

సమూల మార్పుల దిశగా అమెరికా అడుగులు

ప్రస్తుత తరం మారుతున్న వేగానికి అనుగుణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలోనూ పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని, అందుకే ఈ విప్లవాత్మక సమీక్షకు శ్రీకారం చుట్టినట్లు ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ స్పష్టం చేశారు. ధరల స్థిరత్వం, గరిష్ట స్థాయిలో ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ కమిటీలు పనిచేస్తాయన్నారు. విభిన్న రంగాలకు చెందిన ప్రపంచ స్థాయి మేధావులు ఈ ఐదు టాస్క్‌ఫోర్స్‌లలో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ప్యానెల్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, నోబెల్ గ్రహీత థామస్ సార్జెంట్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డౌగ్ మెక్‌మిలన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ తమ తుది నివేదికలను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC)కి సమర్పిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q