ఉపాసనకు షాకిచ్చిన అల్లు అర్జున్ భార్య..తారస్థాయికి చేరుకున్న విభేదాలు..?

మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికగా మెగా, అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్నారు అల్లు ఫ్యాన్స్. తారస్థాయిలో వీరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి.

Allu Arjun s wife did not wish birthday to Upasana

అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. దీంతో వివాదం మరింత ముదిరినట్టు అయింది. ఈ విషయంలో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తెర మీదకు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+