చిరంజీవి సినిమా ఫ్లాపైనందుకు అల్లు ఫ్యామిలీ సంబరాలు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మహేశ్వరి పరమేశ్వరి పతాకంపై టి.సుబ్బరామిరెడ్డి భారీ బడ్జెట్ తో సేట్ రౌడీ సినిమా తీశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాగోలేదంటూ టాక్ వచ్చింది. ఈ సినిమా పోయిందంటూ ఎవరో వచ్చి అల్లు రామలింగయ్యకు చెప్పారు. దీంతో ఆయన స్టేట్ రౌడీ పోయిందంటా అంటూ సెట్స్ లో ప్రచారం చేశారు. దీనికి చిరంజీవి ఎంతో బాధపడ్డారంట. ఏంటీ మామయ్య.. మీరు కూడా అలాగే అంటున్నారంటూ అడిగారంట. సరిగ్గా అప్పుడే ఆ చిత్ర నిర్మాతలు చిరంజీవి దగ్గరకు వచ్చి స్టేట్ రౌడీ మొదటివారం వసూళ్లు భారీగా వచ్చాయంట వివరాలన్నీ చెప్పారు. దీంతో చిరంజీవి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత చిరంజీవి కోపంగా అల్లు రామలింగయ్యవైపు చూడగా.. నాకేం తెలుసు.. ఎవరో చెప్పారు.. నేనూ అదే చెప్పాను.. అంతేకానీ దాన్ని గురించి నాకేం తెలియదని అల్లు రామలింగయ్య అన్నారు. దీనితర్వాత సామాజిక మాధ్యమాల్లో మరో అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధ్రువ సినిమా మంచి హిట్ అయిందని, అయితే ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ సరైన ప్రమోషన్స్ నిర్వహించకుండా సినిమా హిట్ స్టేటస్ ను తగ్గించాడనే అభిప్రాయాన్ని ఓ నెటిజన్ వ్యక్తం చేశారు.

చిరంజీవి గారి స్టేట్ రౌడీ సినిమా పోయిందనీ ప్రచారం చేసిన అల్లు రామలింగయ్య.
— Pawankalyan fan (@appusammangi) August 25, 2024
అలాగే రామ్ చరణ్ దృవ సినిమా హిట్ అయినా కూడా ప్రమోషన్లు చేయకుండా ఆ సినిమా super hit status ని చంపేసిన అల్లు అరవింద్pic.twitter.com/CkX9ZkyYV5
మెగా హీరోలను అల్లు కుటుంబ సభ్యులు తొక్కేయాలని చూస్తున్నారంటూ అనే అర్థం వచ్చేలా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో కూడా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య యుద్ధం ఆగేలా లేదని, పుష్ప2 సినిమాను ప్లాప్ చేసేందుకు మెగా అభిమానులు ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications