భర్తను వదిలేయడానికి రెడీ అయిన అనసూయ
నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. అనసూయ ఏం చేసిన సంచలనమే అనట్టుగా ఉంది పరిస్థితి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ హాట్ టాపిక్‌గా మారారు. హీరోయిన్‌గా అవకాశాలు దక్కాలంటే పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందని అనసూయ తెలిపారు. టాలెంట్ ఉన్న అవకాశాలు వచ్చేది తక్కువే అని ఆమె వెల్లడించారు. షూటింగ్ తరువాత జరిగే నైట్ పార్టీలకు తాను దూరంగా ఉంటానని... బహుశా అందుకేనేమో తనకు హీరోయిన్‌గా అవకాశాలు రాలేదని అనసూయ చెప్పుకొచ్చారు.
ఇక అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఇటీవల పెద్ద చర్చ నడిచింది. ఆమె పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపైన అనసూయ స్పందిస్తూ..తాను ఏం చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తుమ్మిన, దగ్గిన అది కాంట్రవర్సీకి దారి తీస్తోందని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాలపై అక్కడి రిపోర్టులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చానని అనసూయ తెలిపింది. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ అనసూయ క్లారిటీ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనసూయ ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇచ్చారు.
అభిమాని మీరు ఒంటరిగా ఓ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అని అనసూయను ప్రశ్నించాడు.దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. నిజానికి సింగిల్‌గా బయటకు వెళ్లాలంటే ఒకప్పుడు పిచ్చ భయమేసేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తా అంటూ సోలో ట్రిప్ కోసం ఏదైనా ఐడియా ఇవ్వమని ఆ అభిమానిని కోరింది. అయితే మీరు ఎక్కడున్నా పండుగే అని మరో ఫ్యాన్ అనగా.. సో స్వీట్ ఆఫ్ యూ అని మురిసిపోయింది.
అనసూయ సింగిల్‌గా ట్రిప్‌కు వెళ్తానని చెప్పడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. భర్తను వదిలేసి ఒంటరిగానే ట్రిప్స్‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయావా అంటూ నెటిజన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమాలో విలన్ పాత్రలో నటిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.












Click it and Unblock the Notifications