అనసూయకు గుడి..కుష్బూ, సమంత లానే !!

అనసూయ... ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. తనదైన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా 'జబర్దస్త్' షో ద్వారా ఇంటింటా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది.

రంగస్థలం తర్వాత మారిన కెరీర్ గ్రాఫ్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' సినిమాలో కీలక పాత్రలో నటించి అనసూయ సినిమాల కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ పాత్రతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా పొందింది. ఆ తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. కథకు అవసరమైన బలమైన పాత్రల్లో నటిస్తూ, గ్లామర్‌కే పరిమితం కాకుండా తన నటనతో మెప్పిస్తున్న నటిగా గుర్తింపు సంపాదించింది.

anasuya-fan-wanted-to-build-temple-for-like-kushbu-and-samantha-after-taking-permission-comments-go

వివాదాలతో మరింత హాట్ టాపిక్‌..

ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఆ తర్వాత అనసూయ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్, ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే ఇప్పుడు అనసూయకు సంబంధించిన మరో సంచలన విషయం తెరపైకి రావడంతో సోషల్ మీడియా మరోసారి ఉలిక్కిపడింది.

అనసూయకు గుడి కడతామంటూ..

అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడినని చెప్పుకుంటున్న మురళీ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో నటి ఖుష్బూకు, ఏపీలో సమంతకు ఆలయాలు ఉన్న ఉదాహరణలను ప్రస్తావించారు. అదే తరహాలో అనసూయకు కూడా గుడి నిర్మించాలన్నది అభిమానుల ఆకాంక్షగా పేర్కొన్నారు.

అయితే ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా అనసూయ అంగీకారంపైనే ఆధారపడి ఉంటుందని మురళీ శర్మ స్పష్టం చేశారు. ఆమె అనుమతి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభిస్తేనే ఈ ఆలోచనను కార్యరూపం దాల్చేలా చేస్తామని తెలిపారు. అభిమానులంతా కలిసి చర్చించిన తర్వాతే ఆలయం ఎక్కడ నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

anasuya-fan-wanted-to-build-temple-for-like-kushbu-and-samantha-after-taking-permission-comments-go

'ప్రేమతో ఒక గులాబీ చాలు'..

ఆలయం విషయంలో మురళీ శర్మ చేసిన మరో వ్యాఖ్య నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షించింది. "అక్కడ ప్రత్యేక పూజారులు అవసరం లేదని.. ప్రేమతో ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు అంటూ ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు గుడులు కట్టడంపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

కాగా శివాజీ-అనసూయ వివాదం సమయంలో కూడా మురళీ శర్మ బహిరంగంగా అనసూయకు మద్దతుగా నిలిచారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ వీడియోలు విడుదల చేశారు. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఆయనకు ఇప్పటికే గుర్తింపు ఉంది. ఇప్పుడీ గుడి నిర్మాణ వ్యాఖ్యలు వైరల్ కావడంతో, దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆమె దీనిని అంగీకరిస్తుందా? లేక స్పష్టమైన సమాధానం ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

మరోవైపు పెళ్లి అయి ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, అనసూయ అందం, ఫిట్‌నెస్ విషయంలో కుర్ర హీరోయిన్స్‌తో పోటీపడుతుండటం విశేషం. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+