సీసీ కెమెరాల్లో బయటపడ్డ అనసూయ రహస్యాలు ?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

రెండేళ్ల తర్వాత తిరిగి బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది అనసూయ. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోతో అనసూయ బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ ప్రొమోలో అనసూయ గురించి ఎన్‌సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ సరోజ బాలా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనసూయ కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉండేదట.
అబ్బాయిలు ఆమె వెంటపడేవారట. కాలేజ్‌లో అనసూయకు భారీ ఫాలోయింగ్ ఉండేదని టీచర్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అనసూయ వాళ్ల కంటపడకుండా దాచుకుని, దాచుకుని తిరగేదట. అనసూయను కాపాడుకోవడం చాలాకష్టంగా మారిందట. ఆ సమయంలోనే సీసీ కెమెరాల్లో అనసూయని సుశాంత్ చూశాటం.. ఆమె అందానికి ఫిదా కావడం జరిగిందట. దీంతో ఆయన ఆమెని పడేసే కార్యక్రమం పెట్టుకున్నాడట.
మొత్తంగా పడేయడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగిందట. అయితే ఆ రిలేషన్ చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేయాల్సి వచ్చిందని ఎన్‌సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ సరోజ బాలా చెప్పుకొచ్చారు. వాస్తవానికి కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆమె డాక్టర్ కావాలనుకుంది..కానీ యాంకర్ అయ్యిందని చెప్పింది. డాక్టర్ కాలేనందుకు బాధ లేదని, కానీ యాంకర్‌గా, నటిగా ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని సరోజ బాలా చెప్పారు.












Click it and Unblock the Notifications