నా గుండె ముక్కలైంది..సంచలన పోస్ట్ చేసిన అనసూయ.. !
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు.
బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె.41 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వరుస వివాదాల్లో నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది.

ఓ పోకిరి ఇటీవల అనసూయను ఆంటీ అంటూ సంబోంధించాడు. ఇది గమనించిన అనసూయ, దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడంటూ అతనికి సవాల్ విసిరింది. దీంతో బిత్తరపోయిన ఆ పోకిరి అక్కడ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. ధైర్యం చాలడం లేదా, నీ ఫేస్ నాకు గుర్తింది, ఉచ్చ పడుతున్నాయా అంటూ చేతి వేళ్లతో సైగలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. తాజాగా అమ్మడు ఓ వివాదంపై స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూవివాదం ఇటీవల తెలంగాణలో ఒక ముఖ్యమైన రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని.. వేలం వేయడాన్ని ఆపాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై అనసూయ తనదైనశైలిలో స్పందించారు.ఈ వివాదంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. 'ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్' అంటూ రాసుకొచ్చింది. అడవి, అడవిలోని 'పచ్చని అడవి పూడ్చివేసే రోజు వచ్చింది. ఎరుపు రంగులో ఉన్న చెట్లు నేలకూలాయి' అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications