SIR లో పేర్లు తొలగిస్తే పథకాలు పోయినట్లేనా..! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి ఓట్లను మాత్రమే తొలగించాల్సి ఉండగా.. చాలా రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను సైతం భారీ ఎత్తున తొలగిస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కూడా తారుమారు అయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే బెంగాల్లో అయితే ఎస్ఐఆర్ లో ఓట్లు తొలగించిన వారికి సంక్షేమ పథకాలు కూడా తీసేస్తున్నారు.

SIR Enumeration Form Status: ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..!
SIR Enumeration Form Status: ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..!

ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు (Supreme Court).. ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపుకూ, సంక్షేమ పథకాల తొలగింపుకూ లింక్ ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు అంశాలకూ ఉన్న లింకేంటో చెప్పాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికీ నోటీసులు పంపింది. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన SIR కమిటీ చైర్‌పర్సన్ ప్రసేన్‌జిత్ బోస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం, ట్రిబ్యునళ్ల ద్వారా ఇప్పటివరకు 34 లక్షల అప్పీళ్లలో కేవలం 38,000 మాత్రమే విచారించినట్లు పేర్కొంది.

Supreme Court to Examine Whether SIR-Deleted Voters Can Be Denied Welfare Benefits
టార్గెట్ విజయ్ - సుప్రీం లాయరా ? ఆధ్యాత్మిక గురువా ? మోడీ ఛాయిస్ ఏంటి ?
టార్గెట్ విజయ్ - సుప్రీం లాయరా ? ఆధ్యాత్మిక గురువా ? మోడీ ఛాయిస్ ఏంటి ?

బీహార్ SIR కేసులో మే 27న వెలువరించిన తీర్పులో ఈ డేటాను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని , ఇతర సంక్షేమ పథకాల అమలులో దీనిని పరిగణనలోకి తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం ఈ SIR డేటాను ఉపయోగించకూడదని కూడా ఆ తీర్పులో స్పష్టంగా చెప్పినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ పేర్కొన్నారు.పౌరసత్వ చట్టం ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి దానిని ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, దీనిని త్వరలోనే విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+