అనసూయను చూశారా?.. కొత్తగా.. సరికొత్తగా

యాంకరింగ్ కు గ్లామర్ అద్దిన అనసూయ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీ బిజీగా ఉంది. ఇటీవలే విమానం అనే సినిమాలో నటించింది. అందులో వేశ్య పాత్రలో నటించింది. ప్రధాన పాత్రలో సముద్రఖని నటించారు. ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొడుతోంది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. అనసూయ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

కొత్త ఏడాదిలో సరికొత్త తీర్మానం చేసుకుందంట.. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులంతా ఎంతో ఆరోగ్యంగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వర్కౌట్ చేయడానికి జిమ్ కు వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పిన అనసూయ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌ చేస్తోంది. గురజాడ అప్పారావు నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా దీన్ని తీస్తున్నారు. ఇందులో మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించనుంది. వెబ్ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందంట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతోంది. దీన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.

anchor anasuya workouts with family members latest images

జబర్దస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయ పాపులరైన సంగతి తెలిసిందే. ఈ భామ ఒక్కో షోకు రూ. 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఓ మలయాళీ చిత్రంలో నటించింది. మరో మలయాళీ చిత్రంలో అవకాశం వచ్చింది. దీంతోపాటు రెండు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. పుష్ప2లో అనసూయ పాత్రను దర్శకుడు పెంచుతున్నారని తెలుస్తోంది. పుష్ప1లో అనసూయ పాత్రకు మంచి బజ్ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ పాత్రను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+