సుడిగాలి సుధీర్‌కు రష్మి షాక్..కొత్త ప్రయాణం మొదలంటూ పోస్ట్
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. ఇక రష్మి -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది.

అయితే తెర మీద అభిమానులను అలరించడానికే అలా యాక్టింగ్ చేస్తాము తప్పిస్తే..తమ మధ్య ఎలాంటిది లేదని వీరిద్దరు ప్రకటించారు. ఇదిలా ఉంటే రష్మి తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బ్లూ కలర్ డ్రెస్‌లో ఉన్న పిక్స్ పెట్టి సెప్టెంబర్ మొదలైంది. కొత్త ప్రారంభాలకు.. కొత్త జ్ఞాపకాలు సృష్టించేందుకు అని రాసుకొచ్చింది.
ఇక రష్మి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన కొందరు సుధీర్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని కామెంట్ పెట్టగా.. మరికొందరు మాత్రం కొత్త ప్రారంభాలంటే పెళ్లి చేసుకోబోతున్నావా? అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్‌కు షాకిచ్చి మరొకర్ని పెళ్లి చేసుకుంటున్నావా అంటూ మరో నెటిజన్ రష్మిని ప్రశ్నించాడు. ప్రస్తుతం రష్మి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications