ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి గౌతమ్..?
రష్మి గౌతమ్ ఆత్మహత్యాయత్నం చేసిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.
రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుందామె. ఇదిలా ఉంటే రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, కెరీర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా రష్మి ఆత్మహత్య చేసుకోబోయిందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని ఆటో రామ్ ప్రసాద్ బయటపెట్టాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో రష్మి ఆత్మహత్యాయత్నం చేసిందట. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన క్రమంలో తన జాబ్ పోయిందని ఆమె విషం తాగే ప్రయత్నం చేసిందట. అయితే ఇది సరాద జరిగిందని రామ్ ప్రసాద్ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్‌లో రామ్ ప్రసాద్ రష్మి మీద పంచ్ వేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో విషం తాగబోయిన రష్మి, జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్‌కి నువ్వే యాంకర్ అని చెప్పడంతో విషం పక్కన పెట్టి విస్కీ తాగింది' అని పంచ్ వేశాడు. దీంతో షోలో ఒక్కసారి నవ్వులు పూశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.












Click it and Unblock the Notifications