తీవ్ర రక్తస్రావం.. హాస్పిటల్‌లో యాంకర్ రష్మీ.. ఏమైంది?
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకూ యాంకరింగ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకరింగ్ లో అప్పట్లో ఉదయ భాను, ఆ తర్వాత సుమ, ప్రదీప్ ల తర్వాత మంచి పేరు తెచ్చుకుంది రష్మీ. సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి రష్మీ గౌతమ్.. తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో బాధపడుతున్నట్లు ఇటీవల తెలిపింది. గత వారం రోజుల్లోనే ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 9 కి పడిపోయినట్లు తెలిపింది. తన కమిట్ మెంట్స్ ను త్వరగా పూర్తి చేసుకుని.. ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయింది. అయితే తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హాస్పిటల్ లో ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. అయిదు రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ 9 శాతానికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. ఎక్కువగా రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో బాధపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే మొదట దేనికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు.. అని రష్మిక చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందని వివరించింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మరో మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి. అని తెలిపింది.

రష్మికకు సర్జరీ అయిన విషయం తెలిసిన ఫ్యాన్స్.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హెచ్ సీయూ భూముల వివాదంపైనా రష్మీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హెచ్ సీయూ భూవివాదం మీద రష్మీ స్పందిస్తూ.. వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూ భూముల్ని ఆక్రమించొద్దని, అడవిని నరికివేయొద్దని, మూగ జీవాలకు ఇళ్లు లేకుండా చేయొద్దని.. వాటి గోడు వినమని ప్రభుత్వాన్ని రష్మీ గౌతమ్ కోరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications