'యానిమల్' విలన్ బాబీడియోల్ భార్య ఆస్తులు ఎన్నో తెలుసా?
యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్ సినిమా పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఒక రేంజ్ లో విజయాన్ని సాధించింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు అయిన బడ్జెట్ రూ.250 కోట్లు. దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రాబోతోంది.
ఈ సినిమాలో బాబి డియోల్ విలన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులంతా బాబీకి ఫిదా అయ్యారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తనే హాట్ టాపిక్ గా మారాడు. సోషల్ మీడియాలో తనపై తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. బాబీడియోల్ వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అతని వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారు.

బాబీడియోల్ భార్య బ్యాగ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకునే క్రమంలో బాబీడియోల్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. బాబీ భార్య పేరు తానియా. ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర కు ఆమె కూతురు. ఓ పార్టీలో ఆమెను చూసి బాబీ మనసు పారేసుకోవడమే కాదు.. తనను ప్రేమలోకి దింపి విజయం సాధించాడు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులున్నారు. వివాహానికి ముందే తానియా ఇంటీరియర్ డిజైనర్ గా బాగా పాపులర్ అయింది.
2010లో దేవేంద్ర మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తానియా తీసుకుంది. ఆమెపేరు మీద తండ్రి ఆస్తులన్నీ బదిలీ చేయడంతో రూ.300 కోట్లకు యాజమానిగా మారిపోయారు బాబీడియోల్, అతని భార్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తానియా ఈ విషయాన్ని తెలియజేయడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications