జైల్లో దర్శన్, ఆన్ లైన్ రేప్ అంటే ఇదే, నటి సంచలన వ్యాఖ్యలు, మెసేజ్ లు చేస్తే?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగుళూరులో హత్య చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకే రేణుకాస్వామిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నటి, ప్రియురాలు పవిత్ర గౌడకు ప్రైవేట్ పార్ట్ ఫోటోలు పంపించాడనే కోపంతో హీరో దర్శన్, ఆయన అనుచరులు రేణుకాస్వామిని హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.
నటి పవిత్ర గౌడకు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడని, మెసేజ్ లు పంపిస్తున్నాడని రేణుకాస్వామిని బెంగళూరులో హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడతో సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. ఈ ఘటన కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇప్పుడు టీవీ నటి చిత్రాల్ (చిత్రాల్ రంగస్వామి) దీని గురించి మాట్లాడుతూ అదే రేణుకాస్వామి సృష్టించిన నకిలీ ఖాతాల నుండి నాకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా చిత్రాల్ ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడింది. నటికి హత్యకు గురైన రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్న సోషల్ మీడియా ఖాతా గౌతం_ks_1990 అని ఓ వార్తాపత్రిక కథనంలో చూసిన తరువాత తనకు ఆ విషయం తెలిసిందని నటి చిత్రాల్ తెలిపింది. అదే ఐడీ నుంచి నాకు కూడా అసభ్యకరమైన మెసేజ్ వచ్చిందని చిత్రాల్ అంటోంది.వెంటనే నేను నా బ్లాక్‌లిస్ట్‌ని చూసానని, అందులో ఈ ఖాతా ఐడీని గుర్తించారని చిత్రాల్ తెలిపింది.
ఎవరైనా నాకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు, మాస్టర్‌బాష్, ప్రైవేట్ పార్ట్ వీడియోలు పంపితే నేను అలాంటి ఖాతాలను బ్లాక్ చేస్తానని, అలాగే నేను goutham_ks_1990 అనే అకౌంట్ ను బ్లాక్ చేసానని నటి చిత్రాల్ తెలిపింది. ఎందుకంటే ఈ ఐడీ నుండి నాకు అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. అది చూసి నిజంగానే భయపడ్డాను. ఈ ఖాతా మీ బ్లాక్ లిస్టులో ఉందో లేదో చూసుకోండి అని నటి చిత్రా రంగస్వామి ప్రజలకు మనవి చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై నటి చిత్రా మాట్లాడుతూ ప్రతిరోజూ చాలా మందికి ఇలాంటి మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని చూస్తే అసహ్యం వేస్తుంది. అలాంటి ఐడీలు బ్లాక్ చేస్తే వారు మరొక ఐడీని క్రియేట్ చేసి మళ్లీ అలాంటి మెసేజ్ లు పంపుతాని నటి చిత్రాల్ విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి మెసేజ్‌లు చూస్తుంటే మనసు చాలా బాధపడుతుందని, అది ఆన్‌లైన్ రేప్ లాంటిదని, ఎక్కడో కూర్చొని ఎవరినైనా మానసికంగా రేప్ చేయడమంటే ఇలాంటిదే అని నటి చిత్రాల్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications