చైనా మహిళతో సీక్రెట్ రిలేషన్?.. ఎన్విడియా సీఈఓకు బిగ్ షాక్!

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ తయారీ సంస్థ 'ఎన్విడియా' సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్(63) చైనా గూఢచర్య వలలో చిక్కుకున్నారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా నిఘా విభాగం కోసం పనిచేస్తోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న ఓ మహిళా ఎగ్జిక్యూటివ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించడంతో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆయనపై స్వతంత్ర అంతర్గత దర్యాప్తునకు ఆదేశించింది.

ఇరాన్‌పై మరో యుద్ధం ఉండదా? ట్రంప్ కామెంట్లతో మారిన సీన్!
ఇరాన్‌పై మరో యుద్ధం ఉండదా? ట్రంప్ కామెంట్లతో మారిన సీన్!

భార్యకు క్షమాపణలు చెప్పిన హువాంగ్
సంస్థ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఇ-మెయిల్‌లో జెన్సన్ హువాంగ్ తన తప్పును అంగీకరిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "నేను నా భార్యకు నమ్మకద్రోహం చేశాను. నా ప్రవర్తన నా భార్యను, పిల్లలను తీవ్రంగా గాయపరిచాయి. నేను చేసిన దానికి ఎలాంటి సమర్ధనా లేదు. నా ప్రవర్తనకు పూర్తి బాధ్యత వహిస్తూ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను" అని జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. బోర్డు చేపట్టే స్వతంత్ర విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెబుతూనే.. విచారణ సమయంలో కూడా కంపెనీ సీఈవోగా తన బాధ్యతలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Nvidia CEO Jensen Huang Faces Probe Over Affair With Suspected Chinese Spy US President Donald Trump responds

దేశ భద్రత, కంపెనీ రహస్యాలపై విచారణ
ఈ వ్యవహారంతో అమెరికా జాతీయ భద్రతకు గానీ, కంపెనీ కీలక సాంకేతిక రహస్యాలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లినట్లు ఇప్పటివరకు ప్రాథమిక ఆధారాలు లేవని ఎన్విడియా యాజమాన్యం ప్రకటించింది. అయినప్పటికీ విదేశీ గూఢచార సంస్థలు జెన్సన్ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని సమాచారం సేకరించాయా అనే అంశాన్ని స్పష్టం చేయడానికి స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన కమిటీ ద్వారా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.

దీపావళి వేళ దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు.. పలువురు మృతి, కోట్లలో నష్టం!
దీపావళి వేళ దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు.. పలువురు మృతి, కోట్లలో నష్టం!

ఎవరీ ఆలిస్ హువాంగ్? 4.8 బిలియన్ డాలర్ల చిప్ వ్యాపారం
ఈ గూఢచర్య ఆరోపణల కేంద్రంలో ఉన్న మహిళ పేరు ఆలిస్ హువాంగ్. చైనాకు చెందిన ఈమె గతంలో అక్కడి టీవీ రిపోర్టర్‌గా పని చేశారు. తదనంతరం ఆసియా ఫైనాన్స్, టెక్నాలజీ రంగానికి మారారు. ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ డేటా సెంటర్ కంపెనీ 'మెగా స్పీడ్'లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ ఇద్దరి ఇంటిపేరు ఒకటే అయినప్పటికీ వారిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. గత రెండేళ్లలో మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా నుంచి దాదాపు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ చిప్‌లను కొనుగోలు చేసింది. ఆమె జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని.. సేకరించిన కీలక సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది.

స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ జెన్సన్ హువాంగ్ కు మద్దతుగా మాట్లాడారు. "నేను దీనిపై జెన్సన్ హువాంగ్‌తో ఇంకా మాట్లాడలేదు. కానీ ఆయన దేశం కోసం అద్భుతమైన పని చేసిన అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ప్రదర్శనకు ఏదో ఒక కారణం ఉండవచ్చని నేను భావిస్తున్నాను" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే ఆసియా పర్యటనకు కూడా జెన్సన్ హువాంగ్‌ను తనతో తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐ రేసులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసర్లను తయారుచేసే ఎన్విడియా సీఈవోనే ఇలాంటి విదేశీ గూఢచర్య వివాదంలో చిక్కుకోవడం కార్పొరేట్, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+