విడాకుల బాటలో మరో స్టార్ కపుల్..క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ స్టార్ కపుల్ సైతం విడాకులు తీసుకొంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ స్టార్ కపుల్ మరెవరో కాదు..హీరోయిన్ నజ్రియా నజీమ్, నటుడు ఫహాద్ ఫాజిల్.

నజ్రియా నజీమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'రాజా రాణి 'సినిమాతో తెలుగు,తమిళ ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్‌తో ప్రేమలో పడి, అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న, నజ్రియా తిరిగి సినిమాల్లో నటిస్తోంది. నానితో అంటే సుందరానికి సినిమాతో నజ్రియా రీఎంట్రి ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో బాసిల్ జోసఫ్ హీరోగా నటించిన సూక్ష్మదర్శిని సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే గత కొంతకాలంగా నజ్రియా తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాకు ఆమె దూరంగా ఉన్నారు.బంధువులకు సైతం ఆమె కంటెక్ట్‌లో లేరని తేలింది. దీంతో నజ్రియా విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
తన భర్తతో ఫహాద్ ఫాజిల్‌తో విభేదాలు కారణంగానే నజ్రియా సినిమాలకు దూరం అయ్యారని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు.తాజాగా నజ్రియా చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. అందులో ఆమె గత కొంతకాలంగా తన భావోద్వేగ ఆరోగ్యం (emotional well-being), వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే ఆమె కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తన స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో కూడా సరైన కమ్యూనికేషన్‌లో ఉండలేకపోయానని ఆమె పేర్కొన్నారు.
తన 30వ పుట్టినరోజు, కొత్త సంవత్సరం వేడుకలు, తన సినిమా 'సూక్ష్మదర్శిని' విజయాన్ని కూడా తాను సరిగా ఆస్వాదించలేకపోయానని ఆమె బాధపడ్డారు. అంతేకాకుండా, ఎందుకు అందుబాటులో లేనోననే విషయాన్ని స్నేహితులకు వివరించలేకపోయినందుకు , వారి కాల్స్, మెసేజ్‌లకు స్పందించలేకపోయినందుకు ఆమె క్షమాపణలు కోరారు. తాను పూర్తిగా "షట్ డౌన్" అయ్యానని ఆమె అన్నారు. పని విషయమై తనను సంప్రదించడానికి ప్రయత్నించిన ఇండస్ట్రీ వారిని కూడా ఆమె క్షమాపణలు తెలిపారు.
అయితే, ఈ కష్ట సమయంలోనే 'సూక్ష్మదర్శిని' చిత్రానికి కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.చివరగా, ఆమె కోలుకుంటున్నానని, ప్రతిరోజూ మెరుగవుతున్నానని తెలిపారు. పూర్తిగా తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చని, కానీ తప్పకుండా కోలుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ,అభిమానులకు తాను ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని భావించినందునే ఈ పోస్ట్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.ఈ పోస్ట్ ద్వారా నజ్రియా తన వ్యక్తిగత కష్టాలను వెల్లడించింది. తన శ్రేయోభిలాషులకు ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దీంతో చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications