యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్.. ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్..!
తెలుగు యూట్యూబర్ అన్వేష్ అందరికీ పరిచయమే.. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ తన ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను మెటా యాజమాన్యం డిలీట్ చేసింది. ఆ పేజీకి 1.3 మిలియన్లు అంటే 13 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.. అయితే వీళ్ల సంఖ్య ప్రస్తుతం జీరో కు వచ్చింది. ఫీడ్ కూడా మొత్తం మాయం అయింది.
అయితే ఇటీవలికాలంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో యూట్యూబర్ అన్వేష్ అన్వేష్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలు, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అన్వేష్ ఇన్ స్టా అకౌంట్ ను బ్లాక్ చేయాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇక అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వడంపై నటి కరాటే కళ్యాణి తాజాగా ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. "నా పోలీస్ కంప్లైంట్ వలన మరియు హిందువులందరీ సమిష్టి.దీవెనలు మా అడ్వకేట్ Krishnakanth Pothireddy గారు సహాయం తో" నా అన్వేషణ " గాడి ఇన్స్టా గ్రామ్ ఎకౌంట్ డిలీట్ అయ్యింది. ధన్యవాదాలు పంజాగుట్ట పోలీసులు కి ధన్యవాదాలు.. నెక్స్ట్ యూ ట్యూబ్ ఛానల్ నే నాటార్గెట్.." అని రాసుకొచ్చారు. ఆమె ఫేస్ బుక్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అయితే ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, హిందూ దేవతలపై అన్వేష్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. అతడిపై యాక్షన్ తీసుకోవాలని కరాటే కల్యాణి లాంటి వాళ్లు పెద్ద ఎత్తును పోరాడారు. ఈ మేరకు అన్వేష్ పై పంజాగుట్ట స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు కరాటే కల్యాణి.












Click it and Unblock the Notifications