పవన్ నిర్మాతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి..!?

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ నియామకాల పైన ఫోకస్ చేసింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి కొత్త నియామకా ల పైన కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుండటంతో.. పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డిప్యూటీ సీఎం పవన్ నటించిన సినిమా నిర్మాత పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నియామకం పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా హరి హర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరు ఖరారు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును సిఫారసు చేసారు. ఈ నెల 24న హరి హర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

AP govt to Appoint Pawan s movie producer as new FDC chairman

హరిహర వీరమల్లు సినిమా నిర్మాతగా ఏఎం రత్నంకు పవన్ మద్దతుగా నిలిచారు. ఇప్పటికే సినిమా విడుదల తరువాత రెండు వారాల పాటు టికెట్ ధరల పెంపు కోసం ఏఎం రత్నం రెండు ప్రభుత్వాలను అభ్యర్ధించారు. ఏపీ ప్రభుత్వం పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావటంతో వారం పాటు వెసులు బాటు ఇచ్చేందుకు సిద్దమైంది. ఇక, ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా పైన మాట్లాడిన పవన్ సైతం.. ర‌త్నం కోస‌మే మీడియా సమావేశం ఏర్పాటు చేసానని చెప్పారు. ఆయ‌న నలిగిపోతుంటే చూడ‌లేక త‌న వంతు స‌పోర్ట్ అందించిన‌ట్టు పేర్కొన్నారు.

సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో త‌న‌కు తెలియ‌ద‌ని, ఈ ప్రెస్‌మీట్ పెట్ట‌డానికి ముఖ్య కార‌ణం ఏఎం ర‌త్న‌మే అని ప‌వ‌న్ అన్నారు. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాల‌న్నారు. రీజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్య‌క్తి ర‌త్నం అంటూ కొనియాడారు. ఇప్పుడు పవన్ వ్యక్తిగతం ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ గా ఏఎం రత్నం పేరు సిఫారసు చేయటంతో ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+