జూనియర్ ఎన్టీఆర్ పై బాంబు పేల్చిన వేణుస్వామి
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలో, సినీ రంగంలోని సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ కు గురవుతుంటారు. ఈయనకు ప్రధాన టార్గెట్ ప్రభాస్. బాహుబలితోనే ప్రభాస్ మంచి స్థాయికి వెళ్లిపోయారని, అంతకుమించిన స్థాయి రాదంటూ తరుచుగా వ్యాఖ్యలు చేస్తూ డార్లింగ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాడు.
తాజాగా ఓ ఇంటర్వూలో వేణుస్వామి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా తన బయోపిక్ గా తెరకెక్కిందన్నారు. వినాయక్ దర్శకత్వంలో తారక్ ద్విపాత్రాభినం పోషించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి, నరసింహ అనే రెండు క్యారెక్టర్లలో నటించారు.

అదుర్స్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ వినాయక్ ఈ సినిమాని నా బయోపిక్ గా తీశారని చెప్పారు. ఇందులో రెండు పాత్రలు తనవేనని, ఈ సినిమా పూజా కార్యక్రమాలను తానే చేసినట్టు వివరించాడు. పూజ జరిగే సమయంలో తారక్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని, అప్పుడే తాను ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని చెప్పానన్నారు. అదుర్స్ సినిమా తన బయోపిక్ అంటూ వేణుస్వామిమాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏదో ఒక వివాదాస్ప అంశాన్ని ప్రతిరోజు బయటకు తీయడం.. దానిగురించి మాట్లాడిన వీడియో విడుదల చేయడం.. దీన్నిచూసిన నెటిజన్లు చర్చ పెట్టడం.. ఇలా ప్రతిరోజు జరుగుతున్నదే. నెటిజన్ల బలహీనతను ఆసరాగా చేసుకొని వేణుస్వామి మాత్రం పబ్బం గడుపుకుంటున్నారని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications