మార్చి 29 వరకు అల్లు అర్జున్ జైల్లోనే ఉంటాడా?
సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలు చెబుతూ తనను తాను ప్రముఖ జ్యోతిష్యుడిగా చెప్పుకుంటారు వేణుస్వామి. వాస్తవానికి ఆయన జాతకం చూడటమైనా ఆయనకు తెలుసా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. నాగచైతన్య-సమంత విడిపోతారని చెప్పగానే, అది జరగ్గానే కొన్నిరోజులు సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయ్యారు. ఆయన చెప్పిన 100 జాతకాల్లో అదొక్కటే జరిగింది. మిగతా 99 జాతకాలు జరగలేదు. కానీ జరిగిన జాతకాన్ని ప్రచారం చేసుకొని తాను పెద్ద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని నిరూపించుకున్నారు.
వేణుస్వామిని కలిసేవారి సంఖ్య తగ్గింది
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం జరగ్గానే వారు 2027లో విడిపోతారంటూ వీడియో విడుదల చేశారు. దీంతో మహిళా కమిషన్ అతనిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. రష్మికకు పూజ చేయించగానే ఆమె నేషనల్ క్రష్ అయిందంటూ మిగతా హీరోయిన్లు కూడా పూజలు చేయించుకున్నారుకానీ వారెవరూ స్థానికంగా కూడా క్రష్ కాలేకపోయారు. నాగచైతన్య-శోభితపై చేసిన వ్యాఖ్యల వల్ల కొన్నాళ్లు మౌనం వహించారు. ఆ తర్వాత అతన్ని సెలబ్రిటీలు కలుస్తారని, తర్వాత కలిసేవారి సంఖ్య కూడా తగ్గిందని అందరూ చెబుతుంటారు.

అల్లు అర్జున్ ఆరో ఇంట్లో శని
ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వేణుస్వామి. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించడానికి వేణుస్వామి ఆసుపత్రికి వచ్చారు. ఆ బాలుడిని పరామర్శించిన తర్వాత ఆయన మరోసారి అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పారు. జీవితంలో జరిగే సంఘటనలన్నీ జాతకాన్ని బట్టి జరుగుతుంటాయని ప్రవచనం చెప్పారు. అల్లు అర్జున్ ఆరో ఇంట్లో శని ఉన్నాడని, దీనికి ఎవరూ అతీతులు కారని, శని నుంచి తప్పించుకోలేరన్నారు. ఎవరైనా ఆ దశను దాటాల్సి ఉంటుందంటున్నారు.
ఆయన కూడా కష్టాలను ఎదుర్కొన్నారంట
అల్లు అర్జున్ జాతకం బాగుందని, తాను ఎలా అయితే కష్ట దశను అనుభవించానో, అల్లు అర్జున్ కూడా ఆ దశను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. తాను గతంలోనే అల్లు అర్జున్ ఇలాంటి కష్టదశను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పానన్నారు. వ్యక్తి జాతకానికి, షష్టగ్రహ కూటమికి ఎటువంటి సంబంధం ఉందని, అది వచ్చినప్పుడే ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. చివరగా వేణుస్వామి తేల్చిందేమిటంటే మార్చి 29 తర్వాత నుంచి అతని జాతకం బాగుంటుందని. అంటే అప్పటివరకు అల్లు అర్జున్ జైల్లో ఉంటాడని అనుకోవాలా? అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications