మహేష్ బాబుపై బాంబు పేల్చిన వేణు స్వామి
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టేశారు. ఇక ప్రభాస్ ఆరోగ్యంపై కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్‌కు ఇటీవలే పెద్ద సర్జరీ జరిగిందని..అందుకే ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్‌కు రాలేదని వేణు స్వామి తెలిపారు. సలార్ షూటింగ్ తరువాత ప్రభాస్ మూడు నెలలు ఇండియాలోనే లేడని.. సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వేణు స్వామి చెప్పారు. తాజాగా వేణు స్వామి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు. దీనిపై వేణు స్వామి మాట్లాడుతూ..మహేష్‌కు అంత స్టామినా లేదని తేల్చేశారు. రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటున్నారని..అయితే మహేష్ బాబు మీద అంత బడ్జెట్ వ్యర్థమని వేణు స్యామి తెలిపారు. మహేష్ బాబుకు అంత మార్కెట్ లేదని.. టికెట్లు రేట్లు పెంచిన ఆయన సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొందని వేణు స్వామి తెలిపారు.

అయితే రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండటం మహేష్‌కు కలిసి వచ్చే అంశంగా వేణు స్వామి పేర్కొన్నారు. మహేష్ బాబు స్థాయిని తక్కువ చేస్తూ వేణు స్వామి మాట్లాడటంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన తరువాత ఎవరి స్టామినా ఏంటో అప్పుడు తెలుస్తుందని మహేష్ అభిమానులు వేణు స్వామికి కౌంటరిస్తున్నారు. ప్రస్తుతం వేణు స్వామి మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications