బిగ్‌బీ అమితాబ్, రజినీకాంత్, చిరంజీవితో పాటు అయోధ్యకు ఆహ్వానం అందుకున్న సినీ సెలబ్రిటీలు వీరే!!

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణ ప్రతిష్టలో ఈనెల 22వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఘట్టం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నారు. అట్టహాసంగా నిర్వహించబోతున్న ఈ వేడుకకు దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సాధువులు, పీఠాధిపతులు, అత్యంత ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు.

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలను పంపడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి , ఎంపిక చేసిన వారిని మాత్రమే ఆహ్వానించారు. ఇక సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలను కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఇక సినీ సెలబ్రిటీలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో జరిగే వేడుకలో పాల్గొననున్నారు. ముంబై నుండి ఆయన ఒక ప్రైవేట్ చార్టర్డ్ ప్లేన్ లో అయోధ్యకు రానున్నారు.

Ayodhya ram mandir: Big B Amitabh, Rajinikanth, Chiranjeevi.. movie celebrities list who got invited!!

ఇక సినీ రంగానికి చెందిన ప్రముఖులలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రజినీకాంత్, ధనుష్, దర్శకుడు రాజమౌళి, మోహన్ బాబు తదితరులు అయోధ్య వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ లైన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, మాధురి దీక్షిత్, హేమమాలిని, అలియా భట్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్ తదితరులు ఉన్నారు.

శంకర్ మహదేవన్, ఇళయరాజా, రిషబ్ శెట్టి, సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ, సంజయ్ లీలా బన్సాలి, చంద్రశేఖర్ ద్వివేది తదితరులు ఉన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో పలువురు సినీ సెలబ్రిటీలు తమవంతుగా రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి రామచంద్రుడు పై తమ భక్తిని కూడా చాటుకున్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ రామమందిరం నిర్మాణానికి 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు.

2021 లోనే ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. తాను మాత్రమే కాకుండా తనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలతో కూడా పవన్ కళ్యాణ్ విరాళాలు అందజేశారని మొత్తంగా పవన్ కళ్యాణ్ తరపున అయోధ్య రామ మందిరానికి సుమారు 80 లక్షల రూపాయల వరకు విరాళాలు వెళ్లాయని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+