బాలయ్య-పవన్ కల్యాణ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నటులు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించే క్రమంలో వారంతా ఎటువంటి ఇగోలకు పోలేదు. ఒక హీరోకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.. తనకు లేదు అనే ఆలోచనలకు కూడా చోటివ్వలేదు. తర్వాత తరంలో మాత్రం మల్టీ స్టారర్ చిత్రాలు రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర కథానాయకులుగా చెలామణి అయ్యారుకానీ ఎవరికి వారుగా సినిమాలు చేసుకున్నారు.
రాజమౌళి పుణ్యమా అని ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. నందమూరి బాలకృష్ణ-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉన్నప్పటికీ అది మిస్సయింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటించారు. దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ) ముందుగా ఈ కథను బాలయ్యకు వినిపించారు. వెంకటేష్ పాత్ర బాలయ్య చేత వేయించాలనేది దర్శకుడి కోరిక. అయితే వపన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నప్పడు తాను అటువంటి పాత్రలో నటిస్తే బాగోదనిపించింది బాలయ్యకు. అభిమానులకు కూడా నచ్చదేమోనని, ఫ్యాన్స్ హర్టయ్యే అవకాశం ఉందని తిరస్కరించారు. దీంతో ఈ పాత్రను వెంకటేష్ చేత వేయించారు. సినిమా మంచి హిట్ అయింది.

ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుండటంతో బాలయ్య-చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా తీసుకురావాలని నిర్మాత, దర్శకులు ప్రయత్నిస్తున్నారుకానీ వారిద్దరికీ సరిపడే కథ మాత్రం రావడంలేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ కూడా కుదరకపోవచ్చనేది సినీ విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. భవిష్యత్తులో ఏమైనా సాకారం అవుతుందేమో చూడాలి మరి.












Click it and Unblock the Notifications