ఆ ముగ్గురి వల్ల కాని రికార్డును బాలయ్య సాధించబోతున్నాడా?

తెలుగులో ఉన్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ తన తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా మంచి జోరుమీద ఉన్నారు. వరుసపెట్టి హిట్లు ఇస్తూ అభిమానులను అలరించడమేకాదు.. ఈ తరం ప్రేక్షకులతో కూడా జై బాలయ్య అనిపించుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ చిత్రాలతో వరుసగా నాలుగు హిట్లు కొట్టిన బాలకృష్ణ అఖండ2తో మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కాబోతోంది.

ముగ్గురికీ నిరాశే మిగిలింది
చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో పాన్ ఇండియా మూవీ చేసినప్పటికీ తెలుగులో యావరేజ్ గా ఆడింది. మిగతా భాషల్లో ఫ్లాపైంది. అలా చిరుకు పాన్ ఇండియా నిరాశ మిగుల్చింది. వెంకీ సైంధవ్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలనుకున్నారుకానీ కొన్ని కారణాలవల్ల తెలుగులోనే విడుదలై దారుణమైన ఫ్లాప్ అయింది. ఇటీవలే మన్మథుడు నాగార్జున ప్రతినాయకుడిగా నటించిన కూలీ సినిమా విడుదలై.. అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఈ ముగ్గురూ పాన్ ఇండియా హిట్ కొట్టలేకపోయారు. వీరిలో మిగిలింది బాలయ్య ఒక్కడే.

Balayya will deliver his first Pan India hit film through Akhanda 2

ఆ ముగ్గురు వల్ల కానిది అవుతుందా?
అఖండ2 ద్వారా తొలిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న బాలయ్య ఘనవిజయం సాధిస్తాడనే నమ్మకంతో అభిమానులున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన సినిమా కావడం, హిందూమతంపై కథ ఆధారపడటంవల్ల అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకంతో నిర్మాత, దర్శకులున్నారు. తమన్ సంగీతం అందించడం ఆలస్యం కావడంతో డిసెంబరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని నిలబెట్టుకుంటూ మిగతా ముగ్గురు హీరోలవల్ల కానిది బాలయ్య సాధిస్తాడా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబరు వరకు వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+