స్టార్ హీరోకు అనుకున్నట్లే అయ్యింది, అక్కడే సార్ రిలాక్స్, ఇక చుక్కలే చుక్కలు
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన కన్నడ స్టార్ హీరో దర్శన్ తో సహ ముగ్గురు సహచరులను పోలీసు కస్టడీలో విచారించారు. దర్శన్‌తో పాటు అతని సహచరులు వినయ్, ప్రదుష్, ధనరాజ్‌లను శనివారం బెంగళూరు నగరంలోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. హీరో దర్శన్ కు ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది.
నిందితులు అందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. దర్శన్, ఆయన సహచరులను జూలై 4వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గత 12 రోజులుగా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అండ్ గ్యాంగ్ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు తదుపరి విచారణ వరకు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో హీరో దర్శన్ కంబీలనుని లెక్కించాలి.
రేణుకాస్వామి దారుణ హత్య నేపథ్యంలో ఏ1 నిందితురాలు పవిత్ర గౌడతో పాటు మరో 13 మంది ఇప్పటికే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పుడు హీరో దర్శన్‌తో పాటు మరో నలుగురు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు చేరారు. దీని ద్వారా హత్య కేసులో 17 మంది నిందితులు సెంట్రల్ జైలులో ఊచలు లెక్కించాల్సి ఉంది.
హీరో దర్శన్ ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెలుతున్నాడు.

గురువారం దర్శన్ సహా నలుగురిని కోర్టులో హాజరు పరిచిన బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు వారిని మరో రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ గడువు ముగియడంతో శనివారం మళ్లీ హీరో దర్శన్ తో పాటు నిందితులు నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు హీరో దర్శన్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు చెప్పలేదు. దర్శన్ ను విచారణ చేశామని, ఆయన నుంచి వివరాలు సేకరించామని పోలీసులు కోర్టుకు చెప్పారు.
ఇప్పుడు హీరో దర్శన్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని చీకటి గదిలో హీరో దర్శన్ ఉండాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. అయితే రేణుకాస్వామి దారుణ హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో సహ నిందితులు ఎవ్వరికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications