స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన రియల్ ఏసీపీ, సీసీటీవీల్లో, డీవీఆర్ లో జాతకాలు
శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ బెయిల్ మీద బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బెంగళూరు పోలీసులు ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ కు ఊహించని షాక్ ఇచ్చారు.
హత్య కేసులో హీరో దర్శన్, కన్నడ నటి పవిత్ర గౌడ తో పాటు మొత్తం 17 మంది జైల్లో ఉన్నారు. ప్రతినిత్యం సినిమాలు షూటింగ్ లు, పార్టీలు ఫ్రెండ్స్ తో కాలం గడిపే హీరో దర్శన్ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఏకాకిలాగా కాలం గడుపుతున్నాడు. హీరో దర్శన్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్షాలు సేకరించిన పోలీసులు ఆయన్ను మరింత చిక్కుల్లో కి నెట్టారని తెలిసింది. హీరో దర్శన్ తో పాటు ఆయన అభిమానులు షాక్ అయ్యారని తెలిసింది.

రేణుకాస్వామిని హత్య చేసి సైలెంట్‌గా ఉన్న నటుడు దర్శన్‌కు బెంగళూరు ఏసీపీ చందన్ షాకిచ్చారు. రేణుకాస్వామి హత్య కేసు తర్వాత నటుడు దర్శన్ డబ్బు ఇచ్చి కొందరిని బెంగళూరు పోలీసులకు లొంగిపోవాలని పంపించి తరువాత ఆయన మైసూరు వెళ్లిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు. మైసూరుకు వెళ్లిన ఏసీపీ చందన్ హీరో దర్శన్ ను అరెస్ట్ చేయడానికి సిద్దం అయ్యారు. పోలీసులను చూసిన హీరో దర్శన్ నన్ను ఇలా లాక్కెళ్లడానికి మీరు వస్తారని ఊహించలేదు సార్ అని అన్నారని తెలిసింది.
మీరు వస్తారని నేను ఊహించలేదు సార్ అని
నటుడు దర్శన్ ఆ రోజు చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. బెంగళూరు ఏసీపీ చందన్ మైసూర్ వెళ్లినప్పుడు హీరో దర్శన్ జిమ్‌లో వ్యాయామం చేస్తున్నాడు. పోలీసులు హీరో దర్శన్ ను మైసూరులోని జిమ్ సెంటర్ నుంచి నేరుగా బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో దర్శన్‌ను విచారించారు. ఇంటరాగేషన్ సమయంలో మా కుర్రాలు ఏం చేశారో తనకు తెలీదు సార్ అని హీరో దర్శన్ చెప్పాడని తెలిసింది.

వాళ్లు ఏం చేశారో నాకు తెలియదె, నాకు తెలియని విషయాలు నన్ను అడగవద్దు అని హీరో దర్శన్ అన్నారని ఏసీపీ చందన్ కోర్టుకు సమాచారం ఇచ్చారని తెలిసింది. హత్య కేసులో సాక్షాలు, కీలక ఆధారాలు బయటపెట్టడంతో హీరో దర్శన్ తరువాత సైలెంట్ అయ్యారని తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా దర్శన్ కొన్ని రోజులు పోలీసుల మీద కోపంగా ఉన్నాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు.
హీరో దర్శన్‌పై వచ్చిన ఆరోపణలను రుజువు చేసేందుకు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత హీరో కొంచెం సైలెంట్ అయ్యాడని పోలీసులు అంటున్నారు. శాండిల్ వుడ్ హీరో దర్శన్‌కు వ్యతిరేకంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ, డీవీఆర్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రోజులు గడిచేకొద్దీ నటుడు దర్శన్‌పై సాక్ష్యాలు గట్టిపడ్డాయని, దర్శన్‌పై హత్య అభియోగాలు మోపేందుకు అన్ని ఆధారాలు సేకరించారని తెలిసింది. మొత్తం మీద హత్య కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ చందన్ హీరో దర్శన్ కు వ్యతిరేకంగా అన్ని సాక్షాలు సేకరించారని తెలిసింది.












Click it and Unblock the Notifications