మరో కొత్త వ్యాధితో బాధపడుతున్న బిగ్‌బాస్ నటి..
బాలీవుడ్ నటి హీనా ఖాన్ గత కొంతకాలంగా బ్రెస్ట్ క్యాన్సర్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఆమె మరో కొత్త వ్యాధితో బాధపడుతున్నాంటు తాజాగా సోషల్ మీడియా ద్వారా తన ఆవేధనను అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటో తెలుసుకుందాం..
హిందీలో ఏ రిస్తా క్యా కెహలాతా హై సీరియల్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీనాఖాన్. సీరియల్స్‌తో పాటు బిగ్ బాస్ ద్వారా హీనా ఖాన్ కూడా పరిచయమైంది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నట్టు ఇటీవలే బయటపెట్టింది. ప్రస్తుతం నటి హీనా ఖాన్ కీమోథెరపీ చేయించుకుంటోంది.

ఈ సమయంలో ఆమె తన ఆరోగ్యం గురించిన ఎప్పటి కప్పుడు పూర్తి సమచారాన్ని సోషల్‌మీడియాలోని తన ఖాతాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే, తాజాగా తాను మ్యూకోసిటిస్ తో వ్యాధితో పోరాడుతున్నానంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ సమస్య కారణంగా ఆహారం తినడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడుతున్నానంటూ ఓ పోస్ట్‌లో పేర్కొంది. ఈ సమస్యతో తానేమీ తినలేకపోతున్నానని, ఇది తగ్గేందుకు కాస్త రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పాలని ఆమె నెటిజన్లను కోరారు. నిన్న(శనివారం) సాయంత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
రెమెడీలు చెప్పండి.. అంటూ ఆవేదన..
'ఓ వైపు కీమోథెరపీ.. మరోవైపు మ్యూకోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నా.. దీనికి చికిత్సగా డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. కానీ మీలో ఎవరైనా ఈ వ్యాధిని ఎదుర్కొన్నట్లయితే, ఈ వ్యాధి గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే, మందులు, సూచనలు, రెమెడీలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ సమస్యతో కనీసం ఏమీ తినలేకపోతున్నాను' అని నటి హీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం హీనా ఖాన్ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చాలా మంది నెటిజన్లు దేవున్ని ప్రార్ధిస్తున్నారు.












Click it and Unblock the Notifications