బిగ్‌బాస్‌లో 20 ఏళ్ల బ్యూటీ ప్రేమాయణం.. షోలోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పేరెంట్స్!
మలయాళ పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8'లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా ఫాతిమా, మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్‌ల(తాషి) మధ్య ఏర్పడిన ప్రేమ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. వయసులో పెద్దవాడైన తాషికి 150 కెమెరాల ముందే నేహా ఫాతిమా తన ప్రేమను వ్యక్తపరిచింది. అయితే తమ తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తానని కూడా ఆమె స్పష్టం చేసింది.
రంగంలోకి నేహా ఫాతిమా పేరెంట్స్
ఈ జంట మధ్య నడిచిన కెమిస్ట్రీ నేహా తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు. హోస్ట్ మోహన్ లాల్ నిర్వహిస్తున్న 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లోకి నేహా ఫాతిమా తల్లిదండ్రులు నేరుగా చేరుకున్నారు. స్క్రీన్‌పై వారిని చూసి నేహా ఫాతిమా తీవ్ర భావోద్వేగానికి గురి కాగా.. ఆమె తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేహా నీకు ఇప్పటికీ నీ కుటుంబం గుర్తుందా? అసలు మేము గుర్తుకొస్తున్నట్లు కూడా మాకు అనిపించడం లేదు' అని ఆమె తండ్రి నిరాశతో ప్రశ్నించారు. 'మిగతా వారంతా గేమ్ ఆడుతుంటే నువ్వు మాత్రం అనవసరంగా భావోద్వేగాల్లో మునిగిపోతున్నావు. నిన్ను కొందరు గేమ్ కోసం వాడుకుంటున్నారు. మేము వద్దని చెప్పిన మార్గంలోనే నువ్వు వెళ్తున్నావు" అని తల్లి కన్నీళ్లతో కూడిన విజ్ఞప్తి చేశారు. కూతురు మానసికంగా దెబ్బతింటుందని భావించిన నేహా తల్లిదండ్రులు.. ఆమెను షో నుంచి బయటకు పంపించి తమ వెంట ఇంటికి తీసుకువెళ్తామని పట్టుబట్టారు.

స్పందించిన హోస్ట్ మోహన్‌లాల్
నేహా తల్లిదండ్రుల ఆవేదనను హోస్ట్ మోహన్‌లాల్ అర్థం చేసుకున్నారు. "నేను కూడా ఓ కూతురికి తండ్రినే. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల ఆందోళనను నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను" అని మోహన్‌లాల్ అన్నారు. అయితే నేహా ఫాతిమా షో నుంచి పూర్తిగా వైదొలిగిందా లేదా అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
నెట్టింట భిన్నాభిప్రాయాలు
ఈ ఘటనతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు మతాలకు చెందిన నేహా, తాషిల సాన్నిహిత్యం వల్లే నేహా తల్లిదండ్రులు ఈ స్థాయి నిర్ణయం తీసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రియాలిటీ షో నిబంధనలకు విరుద్ధంగా కంటెస్టెంట్ తల్లిదండ్రులను లోపలికి అనుమతించడంపై మోహన్‌లాల్ తీరును కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెద్దల ఆగ్రహం, తల్లిదండ్రుల హెచ్చరికల నేపథ్యంలో నేహా ఫాతిమా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
So, on Bigg Boss Malayalam, Neha Fathima’s parents came on stage to take their daughter back after she proposed to a Hindu contestant, Santhosh Raj, on the show. https://t.co/JVr2Y7jPDa
— Sharanya Shettyy (@Sharanyashettyy) November 1, 2026














Click it and Unblock the Notifications
