మరో బిగ్ మల్టీస్టారర్.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!
తమిళ సినీ పరిశ్రమ వర్గాల్లో ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలైన సూర్య, ధనుష్‌లను ఒకే వెండితెరపై చూడడం అభిమానులకు కనువిందు లాంటిదే. ఇప్పుడు ఈ ఇద్దరితో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి దిగ్గజ డైరెక్టర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. మణిరత్నం వినిపించిన లైన్.. సూర్య, ధనుష్ ఇద్దరికీ బాగా నచ్చిందని.. వారు ఈ ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గాని పట్టాలెక్కితే.. తమిళ సినిమా చరిత్రలోనే ఓ అరుదైన, ప్రేక్షకులను ఆకట్టుకునే కాంబినేషన్‌గా నిలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'యువ' సినిమాలో సూర్య నటించారు. కానీ ధనుష్ ఇప్పటివరకు మణిరత్నంతో కలిసి పనిచేయలేదు. ఒకవేళ ఈ సినిమా ఖరారైతే.. ధనుష్‌కు మణిరత్నంతో ఇదే మొదటి కాంబినేషన్ అవుతుంది. మరోవైపు మణిరత్నం ఇప్పటికే విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'ఇంజి వెల్లం' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ సినిమాను జనవరి 2027 విడుదల లక్ష్యంగా సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి సూర్య-ధనుష్ కాంబినేషన్ వార్త కేవలం సినీ వర్గాల్లో చర్చగానే మిగిలింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పైకి తీసుకురావడంలో మణిరత్నం విజయం సాధిస్తారో లేదో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














Click it and Unblock the Notifications
