వస్తాడు.. ప్లాఫ్ ఇస్తాడు.. వెళ్తాడు.. రిపీటు..!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్లిపోమాకే చిత్రంతో 2017 లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు విశ్వక్ సేన్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది.. ఫలక్ నుమా దాస్.. హిట్.. పాగల్ తదితర సినిమాలతో అలరించారు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇక దాస్ కా ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో తనలోని నటనను బయటకు తీసుకొచ్చారు విశ్వక్ సేన్.. ఇక గతేడాది లైలా, ఈ ఏడాది ఫంకీ సినిమాలతో వరుస ప్లాఫ్ లను అందుకున్నారు. అయితే ఈ సారి ఎలాగైనా కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాలని తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. నటించిన సినిమా 'కల్ట్' ఈ మూవీ అక్టోబర్ 30 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
ఇండియాలో తెరకెక్కిన తొలి స్లాషర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. కల్ట్ మూవీలో గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంతో తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనేరుధ్ భాస్కర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మించారు. అయితే ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే విశ్వక్ సేన్ డైరెక్షన్.. అలాగే మూవీ టెక్నికల్ గా బాగుందని టాక్ వినిపిస్తోంది. ఇక రిలీజ్ కు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోవడం.. ప్రొమోషన్స్ కూడా పరిమితంగా జరగడంతో కల్ట్ కు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పాలి.

కల్ట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కోటి 30 లక్షల రూపాయలు రాబట్టినట్లు సమాచారం. అయితే ఇది ఇటీవల కాలంలో వచ్చిన విశ్వక్ సేన్ చిత్రాలతో పోల్చితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఈ లెక్కన కల్ట్ మూవీ దారుణమైన ఓపెనింగ్స్ ను రాబట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీ ఇండియా నెట్ రూ. 95 లక్షలు కాగా గ్రాస్ రూ. 1.10 కోట్లుగా ఉంది. అటు ఓవర్సీస్ లో ఈ మూవీకి 20 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కల్ట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ. 25-30కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ లెక్కన మూవీ హిట్ కావాలంటే రూ.22కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. తొలి రోజు రూ. కోటి మాత్రమే వచ్చింది. మరి రానున్న రోజుల్లో సినిమా పుంజుకుంటుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
