ఇండియాలో అతి పెద్ద ఫ్లాప్ సినిమా ఇదే
ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, అంచనాలకు తగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే అజయ్ దేవగన్ నటించిన "మైదాన్" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం 1952 నుండి 1962 వరకు భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్ ,మేనేజర్‌గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రాన్ని అమిత్ శర్మ దర్శకత్వం వహించారు.ఏ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఈ చిత్రంలో ప్రియమణి, గజరాజ్ రావు కూడా నటించారు.
ఈ చిత్రం ఏప్రిల్ 10, 2024న విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ స్పోర్ట్స్ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ సినిమా 3 గంటల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉండటం వలన ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు.
కోవిడ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో, నిర్మాణ వ్యయం 150 కోట్ల నుండి 250 కోట్లకు పెరిగింది.మహమ్మారి తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.ఈ కారణాల వలన 'మైదాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. రూ 250 కోట్లు ఖర్చు పెడితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది మాత్రం రూ.68 కోట్లు మాత్రమే. అది కూడా నెట్ కలెక్షన్లు. అంటే ఈ సినిమాకు రూ.50 కోట్లు కూడా షేర్ రాలేదు. ఈ లెక్కన పెట్టిన పెట్టుబడిలో కనీసం 30 శాతం డబ్బులు కూడా తిరిగి రాలేదు.అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.












Click it and Unblock the Notifications