Poonam Pandey: అప్పుడు బాడీతో.. ఇప్పుడు చావుతో.. ఎప్పుడైనా గెలుపు నీదే..!
బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాండే శుక్రవారం చనిపోయినట్లు అందరు భావించారు. కానీ తాను చనిపోలేదని పూనం పాండే చెప్పారు. చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు పూనం పాండే. ఇది సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం చేసినట్లు పేర్కొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మహిళలు వ్యాక్సిన్ వేసుకోవాలని ఆమె కోరారు. ఫిబ్రవరి 2న పూనం పాండే చనిపోయినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇది నిజమేనని నమ్మి అందరు ఆమె చనిపోయినట్లు భావించారు.
అయితే తాను చనిపోలేదని 24 గంటల తర్వాతే అదే ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పై అవగాహన కోసం ఇలా చేసినట్లు చెప్పారు. ఈ వీడియోలో ఆమె ఓ సందేశం కూడా ఇచ్చారు. గర్భాశయ క్యాన్సర్ తను చంపినా తర్వాతా కూడా చాలా మందిని చంపే అవకాశం ఉందన్నారు. మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన ఉండాలి. ఈ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. "నేను జీవించే ఉన్నా.. బతికే ఉన్నా.. క్యాన్సర్ ఇంకా నన్ను తీసుకెళ్లలేదు" అని అన్నారు.

ఇందుకు సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత్ విజేతగా నిలుస్తే నగ్నంగా తిరుగుతానని పూనం పాండే ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలవగానే ఆమె అన్న మాట నిలబెట్టుకున్నారు. నగ్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అప్పుడు బాడీతో ఆటాలాడింది.. ఇప్పుడు చావుతో ఆటాలాడింది. కానీ.. చావుతో ఆడిన ఆట.. చాలా మందిని కదిలించిందని చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications