సౌత్ హీరోయిన్స్‌కి అది చూపించే పిచ్చి ఎక్కువ - బాలీవుడ్ బ్యూటీ
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా మారి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ "డైసీ షా". ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆచార్య గణేశన్ కు అసిస్టెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో "భద్ర" సినిమాతో హీరోయిన్ గా మారింది.
కాగా హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించిన " జై హో " సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె చివరిగా మిస్టరీ ఆఫ్ ద టాటూ సినిమాలో నటించారు. గత ఏడాది రెడ్ రూమ్ అనే ఎంఎం వెబ్ సిరీస్ లో నటించారు.

ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైసీ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాల గురించి కూడా ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఎక్కువగా నడుము , బొడ్డు చూపించే పిచ్చి అలవాటు ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని కన్నడ సినిమాలో నటించే సమయంలో గమనించానని స్పష్టం చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ లో హీరోయిన్స్ నడుమును ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయరని తెలిపింది. అంతే కాకుండా ఓ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. ఒక కన్నడ చానల్లో ఒక హీరో.. హీరోయిన్ బొడ్డుపై పండ్లు వేసి ఆమె నడుమును ఒక సలాడ్ లాగా మార్చేసాడని చెప్పుకొచ్చింది.
కాగా నడుము, బొడ్డుపై కెమెరా క్లోజప్ పెట్టి చూపించడం సర్వసాధారణమీ కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇది కాస్త ఎక్కువగా ఉందని చెప్పింది. మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఓపెన్ అయ్యింది ఈ భామ. అయితే సౌత్ హీరోయిన్ ల గురించి ఈమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Actress Daisy Shah talks about the 'Navel Obsession' in the South Indian Movie Industry
— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 23, 2025
It's hilarious tbh
The incident she talks about I mean https://t.co/pnrUyRV2vc pic.twitter.com/K8SHzslwia












Click it and Unblock the Notifications