భార్యకు ఇష్టం లేదని తప్పించిన హీరో: అసలు ఆ హీరో ఎవరు?

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను సినీ ఇండస్ట్రీలో ఉండే పక్షపాతం, అన్యాయమైన నిర్ణయాలు గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన స్వశక్తితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా తాను ఓ సినిమా నుంచి ఎందుకు తొలగించబడ్డానో వెల్లడిస్తూ అత్యంత విచిత్రమైన, విస్తుపోయే కారణాన్ని బయటపెట్టింది. ఓ ప్రముఖ హీరో భార్యకు తాను నచ్చకపోవడమే అందుకు ప్రధాన కారణమని తాప్సీ వెల్లడించింది.

దేవతలతో పెట్టుకోకండి.. నాని 'ది ప్యారడైజ్'కు వేణుస్వామి సీరియస్ వార్నింగ్!
దేవతలతో పెట్టుకోకండి.. నాని 'ది ప్యారడైజ్'కు వేణుస్వామి సీరియస్ వార్నింగ్!

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎన్నో సినిమాల నుంచి తొలగించబడినప్పటికీ.. ఓ స్టార్ హీరో భార్య అసూయ, అభద్రతాభావం వల్ల తనను ప్రాజెక్ట్ నుంచి తీసేయడం అత్యంత దారుణమైన అనుభవమని పేర్కొంది. హీరో భార్యకు తానంటే ఇష్టం లేదని మాత్రమే చిత్ర నిర్మాతలు తనతో చెప్పారని, అంతకు మించి వేరే సరైన వివరణ ఏదీ ఇవ్వలేదని తాప్సీ వివరించింది. ఆ హీరో భార్యకు తనపై ఎందుకు అంత అసంతృప్తి ఉందో ఇప్పటివరకు తనకు అర్థం కాలేదని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

Bollywood actress Taapsee Pannu Dropped From Movie Due to Star Hero Wife Insecurity Full Details

తాప్సీ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో తాప్సీ ఆ నటుడి పేరు గానీ, ఆ సినిమా పేరు గానీ బయటపెట్టలేదు. అయినప్పటికీ నెటిజన్లు, ఆమె అభిమానులు తాప్సీ కెరీర్ ప్రారంభంలో సంతకం చేసి, ఆ తర్వాత అర్ధాంతరంగా వైదొలిగిన సినిమాల జాబితాను తవ్వుతూ ఆ నటుడు ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టాడు భయ్యా!
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టాడు భయ్యా!

ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే నటిగా తాప్సీకి పేరుంది. ఇండస్ట్రీలో నెపోటిజమ్, సెలక్షన్ ప్రాసెస్‌లో జరిగే అన్యాయాలపై ఆమె చేసిన ఈ కామెంట్స్ సినిమా పరిశ్రమలో నటీనటుల ఎంపికలో ఉండే అనైతిక నిర్ణయాలను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+