2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: సాయి ధరమ్ తేజ్

తెలుగు సినీ పరిశ్రమల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ తోపాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారనే సంగతి తెలిసిందే. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసుకుంటూ వచ్చేవారు. ఎవరినైనా ప్రేమించారా? అంటే అందుకు కూడా జవాబు చెప్పడానికి నిరాకరించేవారు. తాజాగా హైదరాబాద్ లో ఓ సదస్సు జరగ్గా దానికి హాజరైన సాయిధరమ్ తేజ్ కు మరోసారి ఈ ప్రశ్నే ఎదురైంది. అయితే ఈ సారి మాత్రం దానికి సమాధానమిచ్చారు. తనదొక విషాదాంతమైన ప్రేమ కథ అన్నారు.

నాకన్నా తనే ఎక్కువ ఆందోళన చెందింది
2023లో తనకు బ్రేకప్ జరిగిందని, ఇప్పటివరకు తనకైన బ్రేకప్స్ లో ఇదే అత్యంత బాధాకరమైన బ్రేకప్ అని చెప్పారు. దీనికి కారణం కూడా చెప్పారు. విడిపోవడానికి మీడియానే కారణమని తెలిపారు. సినిమా హిట్టయిన తర్వాత సాయిధరమ్ తేజ్ పెళ్లిచేసుకుంటున్నాడని, ఆ అమ్మాయితో పెళ్లి జరగబోతోందంటూ రకరకాల వార్తు రాశారు. ఈ వార్తల వల్లే తమ ప్రేమ ఫెయిలైందన్నారు. మీడియా సంయమనం పాటించివుంటే ఇద్దరికీ వివాహమై ఉండేదన్నారు. నాకన్నా తనే ఎక్కువ ఆందోళన చెందిందని, తర్వాత బ్రేకప్ అయిందన్నారు. మీరంతా సైలెంట్ గా ఉంటే తన పెళ్లిని తానే ప్రకటిస్తానని చెప్పారు.

Breakup in 2023 She left me hero Sai Dharam Tej comments

బ్రేకప్ జరిగింది రెజీనాతోనేనా?
గతంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, అయితే కొన్ని కారణాలవల్ల బ్రేకప్ అయిందని సాయిధరమ్ తోవిరూపాక్ష సినిమా సమయంలో చెప్పారు. అమ్మాయిలంటేనే భయం వేస్తోందన్నారు. సాయిదుర్గాతేజ్ గా పేరు మార్చుకున్న ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు. గతంలో హీరోయిన్ రెజీనా, ధరమ్ తేజ్ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అందులో వాస్తవం ఎంతో తెలియదుకానీ బ్రేకప్ జరిగిందని చెబున్నది కూడా రెజీనాతోనేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+