పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలవడంపై మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ ఎవరో అఫీషియల్‌గా తేలింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో విన్నర్ పేరు వెల్లడైంది. రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు.
అమర్‌దీప్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. శొంఠినేని శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. 35 లక్షల రూపాయలు అతనికి ప్రైజ్ మనీగా అందింది. విన్నర్‌కు 50 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉండగా.. అందులో 15 లక్షలను ప్రిన్స్ యావర్ తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ సామాన్యుడిలా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఇప్పుడు సెలెబ్రిటీగా మారడాన్ని నెటిజన్లు స్వాగతిస్తోన్నారు. మట్టిని నమ్ముకున్న వారికి ఓటమి ఉండదంటూ ప్రశంసిస్తోన్నారు.
తాజాగా పల్లవి ప్రశాంత్‌పై మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టీ హరీష్ రావు ప్రశంసల వర్షాన్ని కురిపించారు. మన సిద్ధిపేట్ రైతుబిడ్డగా అభివర్ణించారు. పల్లవి ప్రశాంత్ అనే తెలంగాణ రైతు పేరు తెలుగువారికి సుపరిచితమైందని, ప్రతి ఇంట్లోనూ ఈ పేరు మార్మోగుతోందని అన్నారు.
ఈ బిగ్ బాస్ సీజన్.. ఓ సామాన్యుడి సత్తాకు అద్దం పట్టిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణాన్ని కల్లకు కట్టినట్టుగా కోట్లాదిమంది తెలుగు ప్రజలకు చూపించిందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్.. వైవిధ్యాన్ని ప్రదర్శించిందని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications