జానీ మాస్టర్‌కు బిగ్ షాక్..!

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టై.. బెయిల్‌పై ఇటీవల విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచారం ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది.

Cancellation of National Award announced for Johnny Master

కాగా, రేపిస్టుకు నేషనల్ అవార్డు ఇవ్వొద్దంటూ పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జానీపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలోనే అవార్డు కమిటీ అతనికి ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేసింది. జానీపై పోక్సో కేసు నమోదు కాడంతో.. అవార్డు కమిటీ గౌరవాన్ని కాపాడుకునేందుకు అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉత్తమ కొరియోగ్రఫీకి గానూ 2022 జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైన జానీ బాషా.. న్యూఢిల్లీలో జరిగే అవార్డు వేడుకకు హాజరుకావడానికి మధ్యంతర బెయిల్ పొందారు. అక్టోబర్ 8న జానీ అవార్డు అందుకోవాల్సి ఉండగా.. తాజాగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన రావడం గమనార్హం. దీంతో అతని బెయిల్ పై అనిశ్చితి ఏర్పడింది.

కాగా, జానీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. 2017లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని, 2019లో అతని టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్లు బాధితురాలు తెలిపింది. ముంబైలో ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణ నిమిత్తం జానీతోపాటు తాను, మరో ఇద్దరు సహాయకులు వెళ్లామని చెప్పింది. అయితే, అక్కడ హోటల్‌లో తనపై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.

ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని తనను జానీ బెదిరించాడని బాధితురాలు వాపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్స్ కు వెళ్లిన సందర్భాల్లో జానీ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీం నుంచి బయటకొచ్చేసినట్లు తెలిపింది. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా జానీ ఇబ్బంది పెట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జానీని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. ఆ తర్వాత అవార్డు కోసం బెయిల్ మంజూరైంది. తాజాగా, ఆ అవార్డు రద్దయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+