"ఆపరేషన్ సింధూర్" పై సినీ సెలబ్రిటీస్ ఎమోషనల్ పోస్ట్స్..

భారతదేశం వ్యాప్తంగా విషాదం నింపింది జమ్మూ కాశ్మీర్‌లోని "పహల్గాం"లో చోటు చేసుకున్న ఉగ్రమూకల దాడి. ఆ ఘటనకు నేడు భారత్ బదులు తీర్చుకుంది. బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్తాన్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.

ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్‌లో, 5 పీఓకేలో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రదారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురీడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లో 2 శిబిరాలు, కోట్‌లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్‌కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి.

celebrities-emotional-posts-on-operation-sindhur

జైషే మహమ్మద్, లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు, ఆయుధ నిల్వలు తుడిచి పెట్టివేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్‌తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు సినీ తారలు సైతం భారత ఆర్మీకి సెల్యూట్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..

పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని కాల్చి చంపారు. దీంతో మృతుల భార్యాలకు నుదుట సిందూరాన్ని దూరం చేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు 'సిందూర్‌' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడులపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడులను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెల మధ్యలో యూరప్‌, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన పర్యటనలు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+