ఇండస్ట్రీకి ఊపిరి పోసిన ఏకైక సినిమా ..లేదంటే దుకాణం మూసుకోవాల్సిందే
ఇండియాలో అతి పెద్ద సినీ ఇండస్ట్రీ అంటే అందరూ చెప్పే మాట బాలీవుడ్ అని. ఇండియన్ సినిమా చరిత్రలో బాలీవుడ్‌లో భాగమే ఎక్కువ అని చెప్పాలి. సినిమాను ఎలా తెరకెక్కించాలో మిగిలిన ఇండస్ట్రీలకు అక్కడి వారు చూపించారు.రాజేష్ ఖన్నా,అమితాబ్, షారుఖ్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలంతా కూడా బాలీవుడ్‌కు చెందినవారే.అయితే గడిచిన 10 ఏళ్లలో బాలీవుడ్ సినిమా రేసులో బాగా వెనుక పడింది. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్‌లో అంతర్మథనం మొదలైంది.
బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిపోయింది. గడిచిన 10 ఏళ్లలో బాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చింది లేదు. షారుఖ్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. అలాంటి బాలీవుడ్‌కు ఊపిరి పోసిన సినిమా ఏదైన ఉందంటే అది కచ్చితంగా ఛావా సినిమానే అని చెప్పాలి. మహారాష్ట్రలో దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ , హీరోయిన్‌గా రష్మిక నటించారు.

ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా విక్కీ, రష్మిక వారి పాత్రలకు జీవం పోశారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని..దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ఛావా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి 150 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. మొదటి రోజు ఛావా 31 కోట్లు, రెండో రోజు 37 కోట్లు, మూడో రోజు 48.5 కోట్లు రాబట్టింది.
దీంతో భారత్‌లో ఛావా 3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 116.5 కోట్లకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సినిమా రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలో మాత్రమే విడుదల కావడం ఛావా సినిమాకు మైనస్‌గా మారింది. ఫ్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల అయి ఉంటే ,దీని కథ మరోలా ఉండేదని సినీ పండితులు చెబుతున్నారు. ఏదీ ఏకమైనప్పటికీ సరైన హిట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్న బాలీవుడ్‌కు ఛావా కాస్తా ఊపిరినిచ్చింది. హిందీలోనే ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications