పుష్ప-2కు భయపడ్డ మెగా ఫ్యామిలీ..?

మెగా వర్సెస్ అల్లు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. రోజు రోజుకి మరింత ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ముష్టి యుద్దానికి దిగుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. 'భోళా శంకర్' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. 'బింబిసార' వంటి హిట్ తర్వాత దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌‌గా విశ్వంభర తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష, యంగ్ బ్యూటీ అశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తైంది.

Chiranjeevi and Ram Charan s films postponed due to pushpa-2

దసరా సందర్భంగా 'విశ్వంభర' టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' కూడా సంక్రాంతికి విడుదల కానుండటంతోనే 'విశ్వంభర' మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు. రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా నటిస్తోంది. ఎస్.జే సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' ను తొలుత డిసెంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ఫ-2కి భయపడే రామ్ చరణ్ , చిరంజీవి సినిమాలు వాయిదా వేసుకున్నారని బన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను తట్టుకోలేకనే వీరద్దరు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+