శ్రీజ-శిరీష్‌కు మరో కొడుకు ఉన్నాడనేదానిపై అతని తల్లి సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని అంశాలపై స్పందిస్తూ పోస్ట్ లు పెడుతుంటుంది. గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మనస్పర్థల వల్ల శిరీష్ తో విడిపోయింది. తిరిగి తండ్రి దగ్గరకు చేరడంతో ఆమెను చిరంజీవి ఆదరించారు. కల్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.
అయితే వీరిద్దరి మధ్య కూడా దూరం పెరిగింది. ఇద్దరూ విడిపోయారంటున్నారుకానీ దీనిపై స్పష్టమైన వివరాలు మాత్రం వెల్లడి కావడంలేదు. ఇటీవలే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరగా ఆయన ఆరోగ్యం క్షీణించి మృతిచెందారు. వీరి ప్రేమకు గుర్తుకు ఓ పాప కూడా జన్మించింది. తనకు నివృత్తి అనే పేరు పెట్టారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత శ్రీజ, శిరీష్ విడాకులు తీసుకున్నారు.

వీరిద్దరికీ ఓ పాప కాకుండా బాబు కూడా ఉన్నాడనే వార్త వైరల్ అవుతోంది. శిరీష్ వద్దే పెరుగుతున్నాడంటూ సోషల్ మీడియా వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన శిరీష్ భరద్వాజ్ తల్లి అటువంటిదేమీ లేదని, అదంతా పుకారు అని, తప్పుడు వార్త అని తెలిపింది. తాజాగా ఓ మహిళా సామాజికవేత్త కూడా శరీష్ కు కొడుకు కూడా ఉన్నాడని కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. దీన్ని కూడా శిరీష్ తల్లి కొట్టిపారేసింది.
సోషల్ మీడియా ఖాతాల్లో కల్యాణ్ దేవ్, శ్రీజ ఒకరి ఖాతాలను మరొకరు డిలిట్ చేసుకున్నారు. దీంతో వారిద్దరూ విడిపోయినట్లేనని అందరూ నిశ్చయించుకున్నారు. ఇటీవలే శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తమను తాము ఏ స్థాయిలో ఉంచుకుంటారో ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారని, ఆ స్థాయిలో ఉన్నవారినే కలుసుకుంటారని పెట్టింది. ఇది కల్యాణ్ దేవ్ గురించే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications