షూటింగ్ స్పాట్‌లో స్పృహ తప్పి పడిపోయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది తాను చేసే పోరాటాలు, నృత్యాలు. కేవలం ఈ రెండు అంశాలతోనే కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకొని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డ్యాన్స్ వేసి కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. తర్వాత కొండవీటి దొంగలో స్లోమోషన్ డ్యాన్స్ వేస్తూ మరో ఒరవడిని ప్రవేశపెట్టారు. గ్యాంగ్ లీడర్ లో వానా వానా వెల్లువాయె పాటలో స్టెప్స్ మరో ఎత్తు. ఇలా డ్యాన్స్ కోసం ప్రాణాలు మొత్తం పెడతారు చిరంజీవి. అటువంటి చిరంజీవి డ్యాన్స్ వేయలేక స్పృహ తప్పి పడిపోయారంటే ఆశ్చర్యం వేయక మానదు. కానీ ఇది నిజంగా జరిగింది. దాని వివరాలను తెలుసుకుందాం.
103 డిగ్రీల జ్వరంతో మలేరియా
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటించేశారు. అయితే ఓ పాటను మాత్రం తీయాల్సి ఉంది. ఆ పాట లేకుండా విడుదల చేద్దామా? అంటే అది సినిమాలోని కథకు లింక్ అయివుంది. దీంతో తప్పనిసరిగా పాటను షూట్ చేసి సినిమాలో కలిపి విడుదల చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో చిరంజీవి తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. మలేరియా సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఈ విషయం తెలియడంతో వెంటనే జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా 103 డిగ్రీలు ఉన్నప్పటికీ పాటకు డ్యాన్స్ వేస్తానంటూ పట్టుబట్టి షూటింగ్ లో పాల్గొన్నారు.

నిర్మాత నష్టపోతాడనే ఉద్దేశంతో..
తాను అలా చేయకపోతే నిర్మాతకు కోట్లరూపాయల్లో నష్టం వాటిల్లుతుందని చిరంజీవి భావించారు. అలా తీవ్రమైన జ్వరంతో చిరంజీవి పాటకు డ్యాన్స్ వేశారు. షూటింగ్ జరిగే సమయంలో ఎన్నోసార్లు అదుపుతప్పి కింద పడిపోయారు. షూటింగ్ కు వచ్చేటప్పుడు ఆయనతోపాటు ఒక వైద్యుడిని కూడా వెంట తెచ్చుకున్నారు. చివరకు ఎలాగోలా చాలా పర్ ఫెక్ట్ గా పాటను పూర్తిచేశారు. అనంతరం అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న విజయ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. దాదాపు రెండు వారాల తర్వాత చిరు కోలుకున్నారు. సినిమా విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. చిరంజీవికి వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. అతని నిబద్ధతపై ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు కొనియాడారు.












Click it and Unblock the Notifications