అల్లు అర్జున్‌ను రక్షించడానికి అతన్ని కలవబోతున్న చిరంజీవి?

ఓ 35 సంవత్సరాల మహిళ మృతిచెందడానికి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురవడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా? అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచివుంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తారు. అప్పటివరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరం జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

కేసు నుంచి బన్నీని బయట పడేయాలని
అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడవేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. నాలుగు వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనపడటంలేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడవేయడానికి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసులో పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి, అది కళ్లముందే కనపడుతోంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళుతుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ ఇష్టపడటంలేదు.

Chiranjeevi trying to get Allu Arjun out of the sandhya theatre stampede case

చిరంజీవిపై వ్యతిరేకత
క్వాష్ పిటిషన్ లో బెయిల్ రావడంపై న్యాయవర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పుచేసిన వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్టం ప్రకారం అది పనిచేసుకుంటూ వెళుతుంది. అందులో తన ప్రమేయం ఏమీలేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవడంకంటే కలవకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+