రాజశేఖర్ నటించిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
అయితే చిరంజీవికి బాలీవుడ్‌లో హీరోగా ఎదగాలనే కోరిక మొదటి నుంచి కూడా ఉంది. ఆ దిశగా కొన్ని సినిమాలు కూడా చేశారాయన. అయితే అవి అక్కడ సక్సెస్ కాకపోవడంతో తెలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. చిరంజీవి బాలీవుడ్‌లో చేసిన మొదటి సినిమా ప్రతిబంధ్. ఈ సినిమా తెలుగులో హీరో రాజశేఖర్ నటించిన అంకుశం సినిమాకు రీమేక్. రాజశేఖర్ కెరీర్‌లో అంకుశం సినిమా బిగ్గెస్ట్ హిట్. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రమిది.

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ జీవిత నటించారు. ఈ సినిమాలో విలన్‌గా నటించిన రామిరెడ్డి, సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చకున్నారు. . 1989లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. అప్పట్లో రాజశేఖర్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ఈ మూవీ కమర్షియల్‌గా కూడా ఈ మూవీ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ కూడా చర్చించుకుందంటే ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమానే చిరంజీవి హిందీలో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లో ప్రతిబంధ్ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించగా, రామిరెడ్డినే అక్కడ కూడా విలన్‌గా నటించారు. చిరంజీవి బాలీవుడ్‌కు కొత్త కావడంతో ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

అయినప్పటికి ఓ కొత్తకు హీరోకి అది పెద్ద హిట్ అనే విధంగానే కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. ఓ తెలుగు హీరో తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్ కొట్టడం అదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేశారు. ఆజ్ కా గూండా రాజ్, ది జెంటిల్ మ్యాన్ చిత్రాలు రీమేక్ చేశారు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ సినిమాలు ఆపేసి, తెలుగులోనే సినిమాలు చేశారాయన.












Click it and Unblock the Notifications