రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..? షాక్ లో జక్కన్న..!
ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ జాబితాలో ఉంది SSMB29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి తొలిసారి జతకట్టడంతో ఈ క్రేజీ కాంబో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా ప్రకటించలేదు.
SSMB29 సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. కానీ ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో విక్రమ్ ను విలన్ పాత్రకోసం రాజమౌళి సంప్రదించారట. అయితే ఇందుకు ఆయన నో చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రాజమౌళి నుంచి గానీ.. చిత్ర యూనిట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విలన్ క్యారెక్టర్ కు విక్రమ్ నో చెప్పడంతోనే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ను రాజమౌళి సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో సలార్ సినిమాలో పృథ్విరాజ్ నెగెటివ్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ ప్రాజెక్టు లో మహేశ్ బాబుతోపాటు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇండోనేషియా నటి చెలిసా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆస్కార్ ఆవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాక హాలీవుడ్ కు చెందిన టాప్ టెక్నీషియన్లు VFX వర్క్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ దాదాపు రూ. 1000 కోట్లతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. మహేశ్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్ట్, జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications