అల్లు అర్జున్ - రామ్‌చరణ్ మధ్య వివాదం ఎక్కడ మొదలైందంటే?

మెగా కుటుంబంలో చీలిక వచ్చింది. అది ఇప్పుడు వచ్చిందికాదు. కొన్నాళ్ల కిందటే వచ్చింది. మెగా కుటుంబం అంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్ హీరోలుగా ఉన్నారు. వీరిలో నాగబాబు సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తారు. మిగతా అందరూ హీరోలే. ఆర్య నుంచి పుష్ప సినిమా వరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు.

మండిపడ్డ మెగా ఫ్యాన్స్
తనకంటూ సొంత ఇమేజ్ ఉండాలి.. సొంత క్రేజ్ ఉండాలి.. ఒకరి నీడ పడకూడదు.. అని భావించిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశారు. వాస్తవానికి మెగా ట్యాగ్ తోనే బన్నీ హీరో అయ్యాడు. మెగా హీరోలందరిలో స్టైలిష్ గా ఉంటాడు కాబట్టి స్టైలిష్ స్టార్ గా మారాడు. తర్వాత ఐకాన్ స్టార్ గా రూపాంతరం చెందాడు. తాను ఎవరి నీడలోను ఉండనని పరోక్షంగా చెప్పాడు. ఐకాన్ అని పెట్టుకోవడంపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. అప్పటి నుంచి మెగా బ్రాండ్ కు దూరంగా ఉంటూ వచ్చిన బన్నీ సహజంగానే వారితో కలవడంలేదు.

clashes between allu arjun and ramcharan details here

చెప్పను బ్రదర్
ఒక మనసు సినిమా ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్.. అని అరుస్తూ ఉంటే బన్నీ ఫైరయ్యాడు. చెప్పను బ్రదర్.. ఊరికే పవన్ కల్యాణ్ అని అరుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది.. వేరే హీరోల ఈవెంట్లలో కూడా ఇలా అరిస్తే ఎలా? అని ప్రశ్నించాడు. అప్పటి నుంచి ఏ సినిమా ఈవెంట్ లోను అల్లు అర్జున్ మెగా హీరోల గురించి ప్రస్తావించలేదు.

అల వైకుంఠపురం సినిమా సమయంలో బన్నీపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. అంతేకాకుండా చిరంజీవి పుట్టినరోజున ఎప్పటికో నామ్ కే వాస్తేగా శుభాకాంక్షలు చెప్పడం కూడా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య బయటకు రాని వివాదం ఏదో జరిగిందని తెలుగు ఫిలింనగర్ వర్గాలు ఎప్పటినుంచో అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+