'నాతో కాంప్రమైజ్ కాకపోతే తీసేస్తా': నటి షాకింగ్ ఎక్స్పీరియన్స్!
సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చేదు నిజాలను, చీకటి కోణాలను బయటపెడుతూ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యాయి. కెరీర్లో అనేక హెచ్చుతగ్గులు ఎదుర్కొన్న ఆమె.. గతంలో ఓ రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో దాదాపు నాలుగున్నర నెలల పాటు తీహార్ జైలులో కూడా గడిపారు. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, కాస్టింగ్ కౌచ్ బాధితురాలిగా తన ఆవేదనను పంచుకున్నారు.
ఒక్క సినిమాతోనే పంజాబీ ఇండస్ట్రీకి దూరం
ఆ ఇంటర్వ్యూ సందర్భంగా.. "మీరు ఒక్క పంజాబీ సినిమా మాత్రమే చేసి ఆ తర్వాత ఎందుకు పరిశ్రమకు దూరంగా ఉన్నారు?" అని ప్రశ్నించగా ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. పంజాబీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుందని, అక్కడ పనిచేయడానికి సరైన అవకాశాలు లేదా మంచి వాతావరణం లేకపోవడమే తాను దూరంగా ఉండటానికి కారణమని చెప్పారు. ఓ రకంగా తనకు వేరే దారి లేకనే ఆ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అర్ధరాత్రి డైరెక్టర్ అకృత్యం
తనకు ఎదురైన భయంకరమైన ఘటన గురించి ఆమె వివరించారు. సందీపా విర్క్ మాట్లాడుతూ.. "నేన ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో దాదాపు 7 రోజుల చిత్రీకరణ పూర్తయింది. ఓ రోజు రాత్రి నేను ఉన్న రూమ్ తలుపు ఎవరో తట్టారు. గత వారం రోజులుగా కలిసి పనిచేస్తున్నాం కదా అనే నమ్మకంతో ఆ చిత్ర దర్శకుడే కావడంతో నేను తలుపు తెరిచాను. అయితే ఆ సమయంలో సదరు డైరెక్టర్ బాగా మద్యం సేవించి ఉన్నాడు. లోపలికి వచ్చి నా మంచంపై కూర్చుని, సినిమా కొనసాగాలంటే తన కోరిక తీర్చాలని(కాస్టింగ్ కౌచ్) డిమాండ్ చేశాడు" ఆమె చెప్పుకొచ్చారు.
బెదిరింపులు, ప్రాజెక్ట్ నుంచి తొలగింపు
డైరెక్టర్ చేసిన ఆ ప్రతిపాదనను తాను అక్కడికక్కడే తీవ్రంగా తిరస్కరించానని సందీపా విర్క్ చెప్పారు. దాంతో ఆగ్రహించిన సదరు డైరెక్టర్, తాను చెప్పినట్లు వినకుంటే సినిమా నుంచి తీసేస్తానని బహిరంగంగానే బెదిరించాడు. ఇప్పటికే 7 రోజుల షూటింగ్ పూర్తయినందున బహుశా తనను సినిమా నుంచి తీసివేయరని ఆమె భావించారు. కానీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కాంప్రమైజ్ కావడానికి ఒప్పుకోకపోవడంతో ఆ డైరెక్టర్ ఆమెను నిజంగానే ఆ ప్రాజెక్టు నుంచి తొలగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా గ్లామర్ రంగం వెనుక ఉన్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ సంస్కృతిని ఎండగడుతూ సందీపా విర్క్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.














Click it and Unblock the Notifications
